ఫోన్‌ట్యాపింగ్ (Phone Tapping)వ్యవహారం తెలంగాణ రాజకీయాలను (Telangana Politics) షేక్ చేస్తోంది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన ఈ బాగోతానికి సంబంధించి కీలక ఆధారాలు బయటకు వస్తున్నాయ్. దీంతో ట్యాపింగ్ తీగలు కేసీఆర్ మెడకు చుట్టుకుంటున్నాయ్. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న భుజంగరావు, రాధాకిషన్ రావు.. అంతా హరీషే (Harish) చేశారని వాంగ్మూలం ఇచ్చారు. ప్రణీత్ రావు, శ్రవణ్‌రావుతో.. హరీష్ సంబంధాలపై కీలక సమాచారం ఇచ్చారు. దీంతో కేసు మరింత రసవత్తరంగా మారింది. అటు తిరిగి ఇటు తిరిగి.. అది కేసీఆర్ మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. మూడోసారి బీఆర్ఎస్‌ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయాని.. కాంగ్రెస్, బీజేపీ (BJP) అభ్యర్థులపై ఎప్పటికప్పుడు నిఘా ఉన్నట్లు వాంగ్మూలంలో వివరించారు ఆ ఇద్దరు.
దీంతో ఇప్పుడు అన్ని వేళ్లు కేసీఆర్ (KCR) వైపే చూపిస్తున్న పరిస్థితి. ఐతే ఇప్పుడీ కేసులో మరో పేరు తెరమీదకు వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో.. అడిషినల్ ఎస్పీ తిరుపతన్న కీలక పాత్ర పోషించినట్లు.. ఆ ఇద్దరు వాంగ్మూలం ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రత్యర్థులను దెబ్బ తీసేందుకు.. వాళ్ల ఆర్థిక మూలాలను టార్గెట్ చేస్తూ తిరుపతన్న చేసిన బాగోతాలు అన్నీ బయటకు వచ్చాయ్. ప్రభాకర్ రావు, భుజంగరావు ఆదేశాలతో.. తిరుపతన్న మెరుపు దాడులు చేశారు తిరుపతన్న. బీఆర్ఎస్ ప్రత్యర్థుల డబ్బులు ఎక్కడ రవాణా అవుతుంటే.. అక్కడికి వెళ్లి తిరుపతన్న పట్టుకునే వారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు డబ్బు చేరకుండా దాడులు చేసేవారు. ఇదంతా సింగిల్ హ్యాండెడ్‌గా చేయలేదు. డబ్బులను పట్టుకునందుకు.. ఓ ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు తిరుపతన్న. ఆ టీమ్‌లో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లతో పాటు.. 10మంది హెడ్ కానిస్టేబుళ్లు ఉండేవారు.
ప్రతీరోజు 40మంది సెల్‌ఫోన్లను తిరుపతన్న ట్యాపింగ్ చేసేవారు. తెలంగాణలో జరిగిన మూడు ఉప ఎన్నికలతో పాటు.. సాధారణ ఎన్నికల్లోనూ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌గా తిరుపతన్న పనిచేశారు. POL 2023 పేరుతో ప్రత్యేకంగా ఎలక్షన్ గ్రూప్‌లను కూడా స్టార్ట్ చేశారు. తిరుపతన్న ఆగడాలు అంతా ఇంతా కాదు. పెద్దల అండతో.. ఆడింది ఆట అన్నట్లు సాగేది మనోడి వ్యవహారం. కొన్ని సందర్భాల్లో SOT, టాస్క్‌ఫోర్స్‌తో కలిసి పనిచేశారు తిరుపతన్న. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్న ప్రణీత్‌రావు ఇచ్చిన సమాచారంతో.. తిరుపతన్న 15ఆపరేషన్లు నిర్వహించారు. మెరుపు దాడులు చేసి.. కాంగ్రెస్, బీజేపీ సానుభూతిపరుల డబ్బులు సీజ్ చేశారు. ప్రస్తుత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి సంబంధించిన డబ్బులను తిరుపతన్న పట్టుకున్నారు.
రేవంత్ మిత్రుడు గాలి అనిల్ కుమార్‌కు చెందిన డబ్బులను కూడా తిరుపతన్న స్వాధీనం చేసుకున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆప్తుడు.. ప్రస్తుత ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురామి రెడ్డి డబ్బులను కూడా సీజ్ చేశారు తిరుపతన్న. వీటితో పాటు రాఘవ ఇన్‌ఫ్రాకు చెందిన డబ్బులను పెద్ద ఎత్తున స్వాధీనపరుచుకున్నారు. ఇక ఎమ్మెల్యే వినోద్‌కు చెందిన విశాఖ ఇండస్ట్రీస్ డబ్బులు.. రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన డబ్బులను కూడా తిరుపతన్న స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి కోసం ఆయన ప్రత్యేకంగా టీమ్ ఏర్పాటు చేసుకున్నారు.
రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డితో పాటు.. కామారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై తిరుపతన్న ప్రత్యేక నిఘా పెట్టారు. ఓవరాల్‌గా 3వందల మంది ఫోన్లను తిరుపతన్న ట్యాప్ చేశారు. మూడు సిస్టమ్స్‌తో పాటు తొమ్మిది లాగర్స్ ఏర్పాటు చేసుకొని.. ట్యాపింగ్ బాగోతం నడిపించినట్లు భుజంగరావు, రాధాకిషన్ రావు.. వాంగ్మూలం ఇచ్చారు. ఐతే ఇవన్నీ బీఆర్ఎస్ హయాంలో పెద్దల సహకారంతోనే జరిగినట్లు చెప్పారు. దీంతో ఈ కేసు కేసీఆర్ మెడకు మరింత బలంగా చుట్టుకుంటోంది.