‍New Rules: కేంద్రం తీసుకొచ్చిన 10 కొత్త రూల్స్ ఇవే.. కొన్నింటికి గడువు తేదీలు సెప్టెంబర్ 30, అమలు తేదీలు అక్టోబర్ 1

మీకు పోస్టాఫీసుల్లో ఎఫ్ డీలు ఉన్నాయా.. క్రెడిట్ కార్డులను విదేశాల్లో వినియోగిస్తున్నారా.. ఇప్పటి వరకూ బర్త్ సర్టిఫికేట్ దరఖాస్తు చేసుకోలేదా.. అయితే ఈ రూల్స్ మీకోసమే. చూసి అలర్ట్ అవ్వండి

  • Written By:
  • Publish Date - September 27, 2023 / 10:47 AM IST

కేంద్రప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సంస్థలు, ప్రభుత్వ.. ప్రైవేట్ బ్యాంకులు ప్రతి నెలా ఏవో ఒక కొత్త రూల్స్ ని తీసుకువస్తూ ఉంటాయి. అయితే గతంలో మనకు పాన్ ఆధార్ అనుసంధానం చేయాల్సిందే అనే రూల్ అందరికీ తెలిసే ఉంటుంది. తాజాగా ఇలాంటి రూల్స్ నే అక్టోబర్ 1 నుంచి అమలు చేయనున్నాయి పలు సంస్థలు. వీటిలో కొన్ని అక్టోబర్ 1తో గడువు ముగియనుండగా మరి కొన్నింటికి గడువు ప్రారంభం కానుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

అక్టోబర్ 1 నుంచి అమలయ్యే కొత్త రూల్స్ ఇవే..

  • కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన రూ.2వేలకు చివరి గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. అక్టోబర్ 1 నుంచి ఈ నోట్లు చెల్లుబాటు కావు.
  • పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ది యోజన, పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన వారు సెప్టెంబర్ 30లోపు ఆధార్ కార్డు సేవింగ్స్ ఖాతాకు అనుసంధానం చేసుకోవాలి.
  • ఇలా చేయని పక్షంలో అక్టోబర్ 1 నుంచి స్మాల్ సేవింట్స్ అకౌంట్స్ ఫ్రీజ్ కానున్నాయి.
  • జనన, మరణాల నమోదు సవరణ చట్టం అక్టోబర్ 1 నుంచి అమలు కానుంది.
  • పిల్లలను పాఠశాలల్లో చేరిపించేందుకు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డ్ నమోదు చేసుకునేందుకు, ఆధార్ మార్పులు చేర్పులకు, ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుకు జనన ధృవీకరణ పత్రం తప్పని సరి చేయనుంది.
  • ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాదారులు సెప్టెంబర్ 30 లోపూ తమ నామినీ పేరు, డాక్యూమెంట్లు పొందుపరచాలి.
  • సెబీ మార్గదర్శకాల ప్రకారం అక్టోబర్ 1 నుంచి ట్రేడింగ్ అకౌంట్లు ఫీజ్ చేయబడతాయి.
  • అక్టోబర్ 1 నుంచి క్రెడిట్ కార్డులను విదేశాల్లో వినియోగించి ఖర్చు చేస్తే వాటిపై అదనపు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.
  • విదేశీ క్రెడిట్ కార్డులపై ఖర్చులు రూ. 7 లక్షలు వరకూ మినహాయింపు ఉంటుంది.
  • ఇచ్చిన లిమిట్ ను అధిగమిస్తూ విద్య, వైద్యం కోసం ఖర్చు చేస్తే 5శాతం, ఇతర ప్రయోజనాలకు ఖర్చు చేస్తే 20శాతం టీసీఎస్ చెల్లించాలి.

T.V.SRIKAR