JAGAN TAPPULU : వైసీపీ ఓటమికి కారణాలు ఇవే..

అధికారం ఉంది కదా అని తప్పులు చేస్తే.. ఒప్పుకోరు ఇక్కడ ! జనాలు అన్నీ గమనిస్తున్నారు జాగ్రత్త. నాయకుడనే వాడు పక్కవాడి తీరుపై ఓ కన్నేయాలి.. ఆ తప్పులను ఆపాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది. జగన్ విషయంలో జరిగింది అదే. వైసీపీ ఓటమికి కారణం అయింది కూడా అదే! డయల్‌న్యూస్ ముందు నుంచి చెప్తోంది అదే.

 

 

అధికారం ఉంది కదా అని తప్పులు చేస్తే.. ఒప్పుకోరు ఇక్కడ ! జనాలు అన్నీ గమనిస్తున్నారు జాగ్రత్త. నాయకుడనే వాడు పక్కవాడి తీరుపై ఓ కన్నేయాలి.. ఆ తప్పులను ఆపాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది. జగన్ విషయంలో జరిగింది అదే. వైసీపీ ఓటమికి కారణం అయింది కూడా అదే! డయల్‌న్యూస్ ముందు నుంచి చెప్తోంది అదే. జగన్ పది తప్పులు అంటూ.. జనాలకు, రాజకీయానికి పరిచయం చేసే తప్పు చేసింది. ఆ తప్పులే వైసీపీని ఇప్పుడు అధికారానికి దూరం చేశాయ్. జగన్‌ చేసిన తప్పుల్లో అతి ప్రమాదకరమైనది.. ఇప్పుడీ పరిస్థితి కారణం అయింది. పగప్రతీకారాల మీద దృష్టిపెట్టడం.

సోనియా, చంద్రబాబే తనను జైలుకు పంపించారనే కసితో రగిలిపోయే జగన్.. 2019లో అధికారంలోకి రాగానే వేట స్టార్ట్ చేశారు. ముందు ప్రజావేదికను కూల్చేశారు.. ఆ తర్వాత అమరావతిలో నిర్మాణాలు ఆపేశారు. చంద్రబాబును ఇంటి నుంచి గెంటేసినంత పనిచేసారు. చంద్రబాబు హయాంలోని పనుల టెండర్లను రీకాల్ చేశారు. ఇక టీడీపీ నేతల్లో ఒక్కొక్కరిపై విడిగా ప్రతీకార దాడులు చేశారు. గొట్టిపాటి రవికి చెందిన మైన్స్ మొత్తం క్లోజ్‌ చేయించారు. డైరీ అక్రమాల పేరుతో ధూళిపాల నరేంద్రను లోపలేశారు. అశోక గజపతి రాజు లాంటి వాడిని కూడా వదిలిపెట్టలేదు. అయ్యన్నను అయితే ఓ ఆట ఆడుకున్నారు. రాష్ట్రంలో చిన్న పెద్ద టీడీపీ నాయకుల్ని మొత్తం మీద ఒక వంద మందిని అరెస్ట్ చేసి లోపల వేశారు. అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారు. నారాయణ విద్యాసంస్థలను దాదాపు మూసేసే పరిస్థితి తీసుకొచ్చారు. సరిగ్గా ఎన్నకల ముందు.. చంద్రబాబును అరెస్ట్ చేసి… 52రోజులు జైల్లో పెట్టారు.

పగ ప్రతీకారాలు, కేసులు, జైలు.. జగన్ పరిపాలనలో ఇవే కనిపించాయ్. ఇవే భారీగా దెబ్బతీశాయ్ కూడా ! జగన్ తీరు ఇలా ఉంటే.. వైసీపీ మంత్రులు, నేతలు.. కబ్జాలతో వణికించేశారు. వీళ్ల ఆగడాలకు.. జనం వణికిపోయారు. ఓటుతో తమ పవర్ ఏంటో చూపించారు. జగన్ జోరు చూసి కిందిస్థాయిలో మంత్రులు ఎమ్మెల్యేలు చెలరేగిపోయారు. ఉత్తరాంధ్ర ఇంచార్జిగా వెళ్లిన ఎంపీ విజయసాయిరెడ్డి.. ఆ మూడు జిల్లాలని వణికించేశారు. వ్యాపారాలు పెట్టారు.. కబ్జాలు చేశారు. రియల్ ఎస్టేట్ వాళ్లందరినీ తమ కంట్రోల్‌లో పెట్టుకున్నారు. తన్ని మరీ భూములు లాక్కున్నారు. విజయనగరంలో మజ్జి శ్రీనివాస్ అలియాస్ చిన్న శీనులాంటి వాళ్లు మరింత చెలరేగిపోయారు. విశాఖలో ఎంవీవీ… తన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో భాగంగా అడ్డగోలు కబ్జాలు చేసి పడేశారు. మిగిలిన ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు గనుల మీద పడ్డారు.

పెద్దిరెడ్డి, సజ్జలతో పాటు కనీసం 60, 70 మంది ఎమ్మెల్యేలు… మైనింగ్‌పైనే ఆదాయాన్ని సమకూర్చుకున్నారు. అన్ని తెలిసి కూడా ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. అదే పార్టీని దెబ్బతీసింది. ఇక జనాలకు, లీడర్లకు జగన్ అందుబాటులో లేకపోవడం కూడా వైసీపీని వీక్ చేసింది. ఎన్నికల సమయంలో బస్సుయాత్ర సంగతి పక్కనపెడితే.. జనాలను జగన్‌ కలిసిందే లేదు. ఐదేళ్లలో జగన్‌ ఒక్క ప్రెస్‌మీట్‌ పెట్టలేదు. అభివృద్ధి పథకాలు అమలు చేసేటప్పుడు, సంక్షేమ పథకాలు ప్రారంభించేటప్పుడు… బటన్ నొక్కడం, స్పీచ్ ఇవ్వడం… చివరలో చంద్రబాబు, పవన్‌ని తిట్టడం… జగన్ చేసింది ఇదే ! ఇక లిక్కర్‌ పేరుతో చేసిన దోపిడీ.. వైసీపీ ఓటమికి మరో కారణంగా మారింది.

ఏపీలో మద్యం అమ్మకాలను కంట్రోల్‌లో పెట్టుకున్న జగన్‌.. దేశంలో దొరికే బ్రాండ్లు రాష్ట్రంలోకి రాకుండా.. సొంత బ్రాండ్లు క్రియేట్ చేశారు. బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్… ఇలాంటి పిచ్చి పేర్లతో లిక్కర్‌ బ్రాండ్లను సృష్టించి.. ఏపీకే పరిమితం చేసి.. అధిక రేట్లకి లిక్కర్ అమ్ముకున్నారు. సొంత లిక్కర్ పాలసీతో.. జగన్, ఆయన చుట్టూ ఉన్న కొందరు మాత్రమే వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయ్. లిక్కర్ రాష్ట్రంలో చాలామందిని ప్రభావితం చేస్తుంది. చేసింది కూడా ! ఫలితాల్లో కనిపించింది అదే. ఇసుక వైసీపీ క్రియేట్ చేసిన ఇసుక కొరత.. పార్టీని నామరూపాల్లేకుండా చేసింది. లిక్కర్ తర్వాత జగన్ సమకూర్చుకున్న ఆదాయ వనరు ఇసుక. రాష్ట్రంలోని ఇసుకను ప్రైవేట్ సంస్థకు లీజ్‌కు ఇచ్చేశాడరు. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు గానీ.. నాయకులు ఎవరు అటు చూడకూడదని ఆదేశించారు. ఆ ప్రైవేట్ సంస్థ ఇసుక తవ్వుకుంటది… దానికి ఎంత చెల్లించాలో అంత ప్రభుత్వానికి చెల్లిస్తుంది.

దీంతో రాష్ట్రంలో ఇసుక కరువు వచ్చేసింది. ఇసుక రేటును ప్రైవేట్ సంస్థ రేటు నిర్ణయించింది. చాలా నిర్మాణాలు ఇసుక లేక నిలిచిపోయాయి. చివరికి అధిక రేటు ఇచ్చి కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇసుక కారణంగా జగన్‌ ఆర్థికంగా బలపడి వచ్చేమో కానీ… సామాన్యులు మాత్రం ఇసుక దెబ్బతో విలవిల్లాడిపోయారు. ఓటుతో తమ పవర్‌ ఏంటో చూపించారు.

ఇక సంక్షేమమే గెలిపిస్తుందని.. అభివృద్ధిని వదిలేసిన జగన్.. రోడ్ల గురించి అసలు పట్టించుకోలేదు. ఇది కూడా వైసీపీ ఓటమికి ఇంకో కారణంగా మారాయ్‌. ఏపీ రోడ్ల గురించి చర్చ జరగని రాష్ట్రం లేదు. ఏపీలో నేషనల్ హైవే మినహాయించి… మిగిలిన రోడ్లన్నీ దారుణంగా ఉన్నాయ్‌. చంద్రబాబు హయాంలో వేసిన సిమెంట్ రోడ్లు మినహా మిగతా రోడ్ల పరిస్థితి చెప్పలేం. డబ్బులనీ సంక్షేమ పథకాలకే పోవడంతో.. రోడ్లను పూర్తిగా వదిలేసింది జగన్ సర్కార్. ముందుగా 3 నుంచి 4వేల కోట్లు ఖర్చు చేసి.. రోడ్లు బాగు చేయించి ఉంటే బాగుండేది.. ఐతే అది కూడా చేయలేకపోయారు. జనం ఏం మాట్లాడుకుంటున్నారో జగన్‌కి తెలియకపోవడమే… వైసీపీకి ఈ పరిస్థితికి రావడానికి ప్రధాన కారణంగా మారింది.

ఇక బాబాయ్ కేసుతో రోడ్డుపడ్డ జగన్‌.. ఎన్నికల్లో తీవ్ర నష్టం ఎదుర్కొన్నారు. టీడీపీ సోషల్ మీడియా… వివేకా హత్యను ఒకటికి పదింతలు చేసింది. మరో సోదరి సునీతా రెడ్డి… జగన్‌, అవినాష్‌కు వ్యతిరేకంగా కోర్టులో పోరాడుతోంది. దీంతో ఇంటిగుట్టు రచ్చకెక్కింది. వివేకా హత్యకు కారణాలేంటి.. హత్య వెనక ఎవరున్నారన్నది తేలకపోయినా.. కేసు ప్రభావం మాత్రం కచ్చితంగా జగన్ గెలుపోటములపై పడింది. జగన్ ఓటమికి మరో ప్రధాన కారణం.. అభివృద్ధికి ఆమడదూరంలో ఏపీ ఉండడం. విజిబుల్ అభివృద్ధి.. ఐదేళ్లలో ఏపీలో కనిపించలేదు. డబ్బులు మొత్తం సంక్షేమ పథకాలకే పెట్టడంతో.. ఖజానాలో రూపాయి మిగల్లేదు. కాంట్రాక్టులకు డబ్బులిచ్చే పరిస్థితి లేదు.

కొత్తగా విద్యాసంస్థలు పెట్టినట్టుగా కానీ.. పరిశ్రమలు పెట్టినట్టుగా కానీ.. ఎక్కడ కనిపించదు. రామాయంపేట పోర్టు, అధాని డేటా సెంటర్‌తో పాటు మరికొన్ని ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నా.. ఏ రకంగానూ ఉపయోగపడలేదు. మరో ప్రధాన కారణం.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోలేకపోవడం. అదానీకి అడ్డగోలుగా ప్రాజెక్టులు కట్టబెట్టింది. రోడ్లు లేవు, వంతెనలు లేవు, పరిశ్రమలు లేవు, విద్యాసంస్థలు లేవు. దీంతో ఏపీలో అభివృద్ధి జరగలేదనేది జనంలోకి బాగా వెళ్లిపోయింది. అదే ఇప్పుడు ఓటమికి కారణం అయింది. అమరావతిని తొక్కేయడం, జనాలను కులాలుగా విడగొట్టడం.. జగన్‌ను బాగా దెబ్బతీసింది. ఏపీ అసెంబ్లీలో అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఆమోదించిన జగన్… అధికారంలోకి వచ్చాక అమరావతిని ఇనుప పాదంతో తొక్కేశారు.

ఏపీకి మూడు రాజధానులు అంటూ ప్రకటించారు. కోర్టు వ్యతిరేకించినా… కేంద్రం వ్యతిరేకించినా… జనం ఒప్పుకోకపోయినా.. విశాఖే రాజధాని అంటూ… ఒక సామాజికవర్గాన్ని టార్గెట్‌గా చేసుకొని అమరావతిని భ్రష్టు పట్టించారు. మరోవైపు విశాఖను వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఆగం చేశారు. ఇదంతా జనంలో జగన్‌ మీద, వైసీపీ మీద.. తీవ్ర వ్యతిరేకతను క్రియేట్ చేసింది. రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయామనే ఆవేదనలోక జనాల్లోకి తీసుకెళ్లారు జగన్‌. ముఖ్యంగా యువత ఇది భారీగా దెబ్బతీసింది. జగన్‌ మీద కసి పెంచుకునేలా చేసింది. ఇక గెలుపు కోసం జనాలను.. కులాలు, వర్గాలుగా విడగొట్టేయడం జగన్ చేసిన మరో దుర్మార్గపు పని. నా ఎస్సీలు , నా బీసీలు, నా ఎస్టీలు… అంటూ జనాన్ని కులాల వారీగా డివైడ్ చేశారు. పేదల ప్రతినిధిగా… సంపన్న వర్గాల నుంచి పేదలను కాపాడే విప్లవకారుడిగా తనను తాను చెప్పుకోవడం, పఠించడం జగన్ చేసిన మరో భయంకరమైన తప్పు.

వైసీపీ ఓటమికి మరో ప్రధానమైన, కీలకమైన కారణం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌. పోలింగ్‌కి సరిగ్గా 15రోజుల ముందు.. టీడీపీ సోషల్ మీడియా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై లేపిన గబ్బు.. జగన్‌ని ముంచేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా జనాల భూముల్ని జగన్ లాక్కుంటాడని.. వాటిని తనఖా పెట్టుకుని డబ్బులు తెచ్చుకుంటాడని.. మీ భూములపై మీకు హక్కు లేకుండా పోయిందని.. ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలోనూ, టీడీపీ మీడియాలోనూ ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై అల్లరి చేశారు. దీన్ని జనం బాగా నమ్మారు. వీటితో తో పాటు రైతు పాస్ పుస్తకాలపై జగన్ తన ఫోటో వేయించుకోవడం, అలాగే భూ సర్వే చేసి పాతిన రాళ్లపై కూడా ఫోటోలు ఎంచుకోవడంతో ఈ భూములన్నీ జగన్ లాక్కుంటాడని.. జనాన్ని బాగా నమ్మించగలిగింది టీడీపీ. కూటమి ఆరోపణలని జగన్ సమర్ధంగా ఖండించలేక పోయారు. ఇక
మేనిఫెస్టో మరో సెల్ఫ్‌గోల్ కొట్టుకున్నారు జగన్. పెద్ద ఆకర్షణ ఉన్న ప్రకటనలేవీ మేనిఫెస్టోలో కనిపించలేదు. ఇలా జగన్‌ చేసిన ఒక్కో తప్పు.. మహా తప్పుగా మారి.. ఇప్పుడు వైసీపీ ఓటమికి కారణంగా మిగిలిపోయాయ్‌.