దేశ ప్రజలకు మేలు కలిగేలా కేంద్రప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అదే టమాటా ధరల్ని నియంత్రించడం. నేటి వరకూ నియంత్రించని ప్రభుత్వాలు భవిష్యత్తులో ఎలా నియంత్రిస్తారన్న సందేహం ప్రతి ఒక్కరిలో కలుగవచ్చు. మన్నటి వరకూ వాతావరణ పరిస్థితులు అనుకూలించక, రవాణా సౌకర్యాలు అందుబాటలో రాక వీటి ధరలు కొండెక్కి కూర్చున్నాయి. అయితే ఆగస్టులో పరిస్థితి ఇలా ఉండకపోవచ్చు అని అంచనా వేస్తున్నారు కేంద్రప్రభుత్వ ఉన్నాతాధికారులు.
కనిష్టంగా రూ. 10.. గరిష్టంగా రూ. 30 కే లభ్యం
టమాటాలు ఎక్కువగా పండే రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో కొనుగోలు చేయాలని భావిస్తుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి ఆయాశాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో రూ. 100 ఉన్న టమాటా పొరుగు రాష్ట్రాల్లో రూ. 250 నుంచి రూ. 300 కూడా పలుకుతోంది. అయితే ఆగస్ట్ చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారానికి వీటి ధరల్లో గణనీయమైన మార్పు కనిపిస్తుంది. కిలో టమాటా కనిష్టంగా రూ.10 నుంచి గరిష్టంగా రూ. 30 వరకూ తగ్గే అవకాశాలు ఉన్నాయి. దీనికి కారణం జూలైలో 2లక్షల 20వేల మెట్రిక్ టన్నులు ఉన్న టమాటా దిగుబడి ఆగస్టుకు వచ్చే సరికి 5లక్షల 50వేల మెట్రిక్ టన్నులకు చేరనుంది. అంటే ఒక్కసారిగా డబుల్ అనమాట. దీంతో సప్లై పెరుగుతుంది. డిమాండుకు సరిపడా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. పైగా వర్షాకాలం కావడంతో వ్యాపారస్తుడు ఎక్కువ కాలం నిలువ ఉంచుకోలేడు. దీంతో తక్కువ ధరకే అమ్మే పరిస్థితి ఉంటుంది.
తగ్గుదలకు కారణాలు
అలాగే వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి మరిన్ని విషయాలు వెల్లడించారు. దేశంలో అత్యధికంగా టమాటాలు పండే ప్రాంతాలైన హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీతో పాటూ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికంగా ఎగుమతి చేస్తారు. హిమాచల్ ప్రాంతంలో పండే పంట ఉత్తరాది రాష్ట్రాలకు సరఫరా అవుతుంది. అలాగే దక్షిణాది ప్రాంతాల్లో పండే టమాటా సౌత్ ఇండియా మొత్తం పంపిణీ అవుతుంది. వీటి ఉత్పత్తి జూన్ – జూలైలో 2వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉండేది. ఆగస్ట్ లో ఇది కాస్త 30వేల మెట్రిక్ టన్నులకు పెరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే సెప్టెంబర్ నాటికి 9లక్షల 50వేల మెట్రిక్ టన్నుల నుంచి అక్టోబర్ వచ్చే సరికి 13 లక్షల మెట్రిక్ టన్నులకు చేరే అవకాశం కనిపిస్తుంది.
దీనిని బట్టి అర్థమైంది ఏమిటంటే గతంలో సాగు తక్కువ ఉన్నకారణంగా రవాణా, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా విపరీతమైన ధరలు కొనసాగాయి. రానున్న రోజుల్లో సాగు రెట్టింపు అవున్న కారణంగా మళ్లీ తిరిగి సాధారణ పరిస్థితికి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
T.V.SRIKAR