ఖైరతాబాద్ గణేష్ ప్రత్యేకతలు ఇవే, ఎన్ని టన్నుల ఐరన్ వాడారంటే…

వినాయక చవితి అనగానే ఖైరతాబాద్ గణేష్ గురించే చర్చలు అన్నీ. ఎత్తైన విగ్రహంతో ఆకట్టుకునే బొజ్జ గణేశుడుని చూడటానికి దేశం నలుమూలల నుంచి వస్తూ ఉంటారు. ఇక నిమజ్జన ఉత్సవం అయితే ఎంతో ఘనంగా జరుగుతుంది.

  • Written By:
  • Publish Date - September 16, 2024 / 12:53 PM IST

వినాయక చవితి అనగానే ఖైరతాబాద్ గణేష్ గురించే చర్చలు అన్నీ. ఎత్తైన విగ్రహంతో ఆకట్టుకునే బొజ్జ గణేశుడుని చూడటానికి దేశం నలుమూలల నుంచి వస్తూ ఉంటారు. ఇక నిమజ్జన ఉత్సవం అయితే ఎంతో ఘనంగా జరుగుతుంది. అసలు ఈ ఏడాది ఈ విగ్రహం ప్రత్యేకతలు ఏంటో చూద్దాం. 1954 లో మొదటి సారి ఖైరతాబాద్ లో అడుగు ఎత్తులో గణేషుని ప్రతిష్టించారు నిర్వాహకులు. ఆ తర్వాత సంవత్సరం.. సంవత్సరం అడుగు మేర ఎత్తు పెంచారు.

ఈ సంవత్సరం 70 అడుగుల ఎత్తు 28 అడుగుల వెడల్పుతో సప్తముఖ మహా శక్తి మట్టి గణపతిని రూపొందించారు. ఇందుకోసం 1000 సంచుల మట్టి, 18 టన్నుల ఇనుము, 2 వేల మీటర్ల నూలు వస్త్రం, 2 వేల మీటర్ల జూట్ ను వాడి గణేష్ విగ్రహాన్ని తయారు చేసారు. 70 ఈ సంవత్సరాలు అయిన సందర్భంగా 7 తలలు, 7 సర్పాలు, ఎందు వైపులా 7 చొప్పున మొత్తం 14 చేతులతో గణేష్ విగ్రహాన్ని రూపొందించారు నిర్వాహకులు. గణపతికి కుడివైపున 12 అడుగుల ఎత్తులో బాల రాముడి విగ్రహం ప్రతిష్టించారు.

78 రోజులలో బడా గణేషుని తయారు చేసారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన లక్షలాదిమంది భక్తులు ఖైరతాబాద్ బడా గణేష్ దర్శించుకున్నారు. అర్థరాత్రి 12 గంటలకు ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనం నిలిపివేసింది ఉత్సవ కమిటీ. దర్శనం నిలిపి వేసిన తరువాత కూడా అర్థరాత్రి 1 గంట వరకు భక్తులు భారీ ఎత్తున వచ్చి దర్శించుకున్నారు. నేడు పూజ అనంతరం మండపం నుండి బడా గణేషున్ని వేరు చేసే పనులు మొదలుపెడతారు. రేపు ఉదయం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభం అవుతుంది. ఈ శోభాయాత్రలో లక్షలాది మంది పాల్గొని గణేశుడుకి వీడ్కోలు పలుకుతారు.