Lokesh And Pawan Kalyan: టీడీపీ – జనసేన మొదటి జాయింట్ యాక్షన్ కమిటీలో చేసిన మూడు తీర్మానాలివే

చంద్రబాబు అరెస్ట్ తరువాత ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. టీడీపీ-జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తాయని ప్రకటించారు పవన్. ఇందులో భాగంగా నారా లోకేష్, పవన్ కళ్యాణ్ అధ్యక్షతన మొదటి జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహించారు. ఇందులో మూడు తీర్మానాలను ప్రవేశపెట్టారు.

  • Written By:
  • Publish Date - October 25, 2023 / 02:02 PM IST

టీడీపీ-జనసేన ఇక నుంచి ఏ కార్యక్రమం ప్రవేశపెట్టినా కలిసి వెళ్లాలని నిర్ణయించుకుకన్నాయి. ఇందులో భాగంగా ఒక మ్యానిఫెస్టో తయారు చేసేందుకు సిద్దమైంది. రెండు పార్టీలక చెందిన క్యాడర్ ను దిశానిర్ధేశం చేసింది. ఇప్పటికే కమిటీ సభ్యులను నియమించి ఇరు పార్టీలు వేరు వేరుగా సమావేశాలు ఏర్పాటు చేశారు. భవిష్యత్తు కార్యచరణపై చర్చించారు. నవంబర్ 1 నుంచి ఉమ్మడిగా జనంలోకి వెళ్లాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఏపీలో తొలగించిన ఓట్లపై తమ గళాన్ని వినిపించనున్నారు. ప్రజా క్షేత్రంలోకి వెళ్లి వైసీపీ తన పరిపాలనలో చేసిన అరాచకాలను వివరించనున్నారు. ఇందు కోసం 100 రోజుల ప్రణాళికలు రచించిచారు ఇరు పార్టీ నేతలు. టీడీపీ – జనసేన రావాలి.. వైసీపీ పోవాలి అనే పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమయ్యారు.

తాజాగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జనసేన ఎన్డీయేలో భాగస్వామిగా కొనసాగుతూనే టీడీపీతో పొత్తులో ఉంటుందని ప్రకటించారు. దీంతో ఎన్నికల వేళ బీజేపీ కూడా వీరితో కలిసి పోటీ చేసేందుకు సిద్దమయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు రాజకీయ పండితులు. ఈ జాయింట్ యాక్షన్ కమిటీలో మూడు తీర్మానాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ వైసీపీ పాలనలోని వైఫల్యాలను ఎండగట్టడం, అన్ని వర్గాలకు అభివృద్ది అందించడం, చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ నిరసన తెలపడం వంటివి ప్రదానంగా వినిపిస్తున్నాయి. వీటిని క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లేందుకు జిల్లాల వారిగా కార్యకర్తలను సన్నద్దం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 29,30,31 తేదీల్లో జరిగే సమావేశాల్లో పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసే సమావేశంలో ఇరు పార్టీ నేతలు పాల్గొంటారు. ఆ తరువాత నవంబర్ 1 నుంచి ప్రజల్లో తమ మ్యానిఫెస్టోని ప్రకటిస్తూ ప్రజల్లో మమేకం అవుతారు.

ప్రజా క్షేత్రంలో పోరాడుతూనే నవంబర్ 3 న విజయవాడలో మరో సారి జనసేన – టీడీపీ ఉమ్మడిగా విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయనుంది. ఇందులో ఇంటింటి ప్రచారంపై క్యాడర్ దృష్టి పెట్టేలా ఇందులో దిశానిర్థేశం చేస్తారు. ఇదిలా ఉంటే వీరిద్దరి పొత్తుపై అధికార వైసీపీ నుంచి తీవ్రంగా విమర్శలు వినిపిస్తున్నాయి. వీరి పొత్తు వల్ల జగన్ ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీ లేదని చెబుతున్నారు వైసీపీ నాయకులు. అయితే వీరి యాత్రల కంటే ముందుగానే వైసీపీ సామాజిక సాధికారత అనే పేరుతో బస్సుయాత్ర చేపట్టేందుకు సిద్దమైంది. ఇలాంటి తరుణంలో ప్రజల మద్దతు ఎవరికి ఎక్కువ ఉంటుందో వేచి చూడాలి.

T.V.SRIKAR