Oscar Awards : ఆస్కార్ అవార్డుల విజేతులు వీళ్లే..

ప‌్ర‌పంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సినిమా ప్రేమికులు ఎదురు చూసే అవార్డుల్లో ఆస్కార్ అవార్డుల‌కు (Oscar Awards) ప్ర‌త్యేక స్థానం ఉంది. ఇక హాలీవుడ్‌ (Hollywood) కు చెందిన న‌టీనటుల‌కైతే త‌మ లైఫ్‌లో ఒక్క సారైన ఈ అవార్డులు అందుకోవాల‌ని క‌ల‌లు కంటూ ఉంటారు. గత ఏడాది ట్రిపులార్ సాంగ్‌కు ఆస్కార్‌ బరిలో అవార్డు రావటంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ వేడుకకు బాగా కనెక్ట్ అయ్యారు.

 

 

ప‌్ర‌పంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సినిమా ప్రేమికులు ఎదురు చూసే అవార్డుల్లో ఆస్కార్ అవార్డుల‌కు (Oscar Awards) ప్ర‌త్యేక స్థానం ఉంది. ఇక హాలీవుడ్‌ (Hollywood) కు చెందిన న‌టీనటుల‌కైతే త‌మ లైఫ్‌లో ఒక్క సారైన ఈ అవార్డులు అందుకోవాల‌ని క‌ల‌లు కంటూ ఉంటారు. గత ఏడాది ట్రిపులార్ సాంగ్‌కు ఆస్కార్‌ బరిలో అవార్డు రావటంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ వేడుకకు బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే ఈ ఏడాది ఇండియన్ మూవీస్ ఏవీ, కాంపిటీషన్‌లో లేకపోయినా… ఇక్కడ కూడా బజ్‌ మాత్రం బాగానే ఉంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డ్స్ ఆస్కార్స్ ప్రదానోత్సవం లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో (Dolby Theatre) అంగరంగ వైభవంగా జరిగింది.ఈ అవార్డుల వేడుకకు దేశ, విదేశాల నుంచి సినీ తారలు హాజరయ్యారు.

ముందు నుంచి ఊహించినట్టుగానే కిస్ట్రోపర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కి ఓపెన్ హైమర్ సినిమా ఏడు ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్ట‌ర్.. బెస్ట్ యాక్ట‌ర్, బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట‌ర్, బెస్ట్ సినిమాటోగ్ర‌ఫీ, ఎడిగింగ్, బెస్ట్ ఒరిజిన‌ల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స‌హా ప‌లు విభాగాల్లో ఈ సినిమా స‌త్తా చాటింది. ఓపెన్ హైమ‌ర్ సినిమాలోని న‌ట‌న‌కు కిల‌య‌న్ మ‌ర్ఫీ, అటు ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా క్రిస్టోరఫ‌ర్ నోల‌న్ ఆస్కార్ అవార్డు అందుకున్నారు. ఉత్త‌మ స‌హాయ న‌టుడు విభాగంలో రాబ‌ర్డ్ డౌనీ జూనియ‌ర్.. ఉత్త‌మ ఎడిటింగ్ విభాగంలో జెన్నీఫ‌ర్ లేమ్, బెస్ట్ ఒరిజ‌న‌ల్ బ్యాక్ గ్రౌండ్ స‌హా ఆరు విభాగాల్లో ఈ సినిమా స‌త్తా చాటింది.

అటు ఉత్త‌మ న‌టిగా ఎమ్మా స్టోన్ ఆస్కార్ అవార్డు కైవసం చేసుకుంది. ఉత్తమ స‌హాయ న‌టి విభాగంలో డేవైన్ జో రాండాల్ఫ్ ది హోల్డ్‌వ‌ర్స్‌ సినిమా అవార్డు అందుకుంది. బెస్ట్ డాక్యుమెంట‌రీ ఫీచ‌ర్ ఫిల్మ్ విభాగంలో 20 డేస్ ఇన్ మ‌రియోపోల్ ఎంపికైంది. బెస్ట్ హెయిర్ స్టైయిల్ అండ్ మేక‌ప్ విభాగంలో న‌డియా స్టేసీ, మార్క్ కౌలియ‌ర్ అకాడ‌మీ అవార్డు అందుకున్నారు. అటు బెస్ట్ అడాప్టెడ్ స్క్రీప్లే విభాగంలో కార్ట్ జెఫ‌ర్‌ప‌న్, బెస్ట్ ఒరిజిన‌ల్ స్క్రీన్ ప్లే మూవీ ఎంపికైంది. బెస్ట్ యామిటమేటేడ్ ఫీచ‌ర్ ఫిల్మ్.. ది బాయ్ అండ్ ది హిరాన్.. బెస్ట్ కాస్టూమ్ డిజ‌న్ విభాగంలో హోలి వెడ్డింగ్ ట‌న్.. బెస్ట్ ప్రొడ‌క్ష‌న్ డిజైన్.. జేమ్స్ ప్రైజ్, షెనా హెత్. బెస్ట్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్.. ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్.. అవార్డులు కైవ‌సం చేసుకుంది.