Chandrababu:ఏసీబీ కి చంద్రబాబు ఇచ్చిన వాగ్మూలం ఏంటో తెలుసా..?

ఏసీబీ కోర్టులో ఆదివారం చంద్రబాబు ఇచ్చిన వాగ్మూలం ఏంటో చూసేయండి.

  • Written By:
  • Publish Date - September 12, 2023 / 11:22 AM IST

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఏసీబీ కోర్టుకు తీసుకెళ్ళారు సీఐడీ పోలీసులు. అక్కడ చాలా సేపు ఇరుపక్షాలు వాదోప వాదనలు వినిపించుకున్నాయి. చంద్రబాబు తరఫున సిద్ధార్థ్ లూథ్రా వాదించగా సీఐడీ తరఫున పొన్నవోలు సుధాకర్ కేసులు డీల్ చేశారు. అయితే ఇరువురి వాదనలు విన్న తరువాత ఏసీబీ కోర్ట్ న్యాయమూర్తి హిమబిందు నిందితుడిగా ఉన్న చంద్రబాబుకు అవకాశం ఇచ్చారు. తన కేసుపై ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పవచ్చన్నారు.

జడ్జి మాటలకు స్పందించిన చంద్రబాబు సీఐడీ అధికారుల గురించి ఇలా అన్నారు. తనను ఒక రోజంతా వాహనాల్లో రోడ్లపై తిప్పుతూ మానసికంగా వేధించారని, తనను సిట్ అధికారులు విచారిస్తున్న దృశ్యాలను కావాలనే ఉద్దేశ్యపూర్వకంగానే మీడియా ఛానళ్లలో వచ్చేలా ప్రసారం చేశారన్నారు. ఈ వాదనలు అన్నీ విన్న న్యాయమూర్తి పోలీసులు మీతో దురుసుగా ప్రవర్తించారా అని ప్రశ్నించారు. అప్పుడు చంద్రబాబు వివరణ ఇస్తూ నన్ను శారీరకంగా ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. ఇలా ఏసీబీ కోర్టులో చంద్రబాబు, న్యాయమూర్తికి మధ్య జరిగిన పరస్పర సంభాషణాత్మక వాగ్మూలం రిమాండుకు పంపుతూ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో బయటకు వచ్చాయి.

జడ్జి ముందు కూడా రాజకీయ కోణమేనా..

చంద్రబాబు మాటల వల్లే ఆయనకు బెయిల్ రాలేదని స్పష్టంగా అర్థమౌతోంది. న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు రాజకీయ రంగు అద్దే ప్రయత్నం కనిపిస్తోంది. తనను శారీరకంగా ఇబ్బంది పెట్టలేదంటారు.. రోజంతా వాహనాల్లో తిప్పారంటారు. ఎక్కడైనా రోజంతా ప్రయాణం చేస్తే మానసికంగా కంటే కూడా శారీరకంగానే అలసిపోతారు. కానీ ఇక్కడ శారీరకంగా ఇబ్బంది లేదు అంటూ చెప్పారు చంద్రబాబు. మరొక అంశం ఏంటంటే.. సిట్ కార్యాలయంలో విచారణ ఫోటోలు మీడియాలో ప్రసారం చేస్తే ఉద్దేశ్యపూర్వకంగా అంటూ సాకులు చెప్పే ప్రయత్నం చేశారు. అక్కడ ఫోటోలు తీయడం, వీడియోలు చిత్రీకరించడం మీద కాదు కేసు నమోదు చేసింది. అవినీతి కోణంలో కేసు నమోదు చేశారు. నేను ఆ డబ్బులు తీసుకోలేదు. నాకు ఏమీ తెలీయదు అని చెప్పి ఉంటే మరోలా ఉండేది. అలా కాకుండా తనదైన శైలిలో రాజకీయాలకు తావిచ్చారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయినా  ప్రతి అంశంలో మీడియా ప్రాపగండ కోరుకునే చంద్రబాబు ఈవిషయంలో పబ్లిసిటీ ఎందుకు వద్దనుకున్నారు. అయినా మీడియా వాళ్లు పోటోలు తీసుకుంటే ఏమి.. వీడియోలు తీసుకుంటే ఏమి అక్కడ అందరూ ఉన్నప్పుడే కదా తీసుకున్నారు. చంద్రబాబును ప్రత్యేకించి తీసుకోలేదు కాదా అన్న వాదనలు బయట వినిపిస్తున్నాయి.

T.V.SRIKAR