టీవీ 5 మూర్తి బెదిరింపులు తట్టుకోలేకపోతున్నామని.. తమకు చావే దిక్కు అని.. వేణుస్వామీ సతీసమేతంగా మీడియా ముందుకు వచ్చి తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వేణుస్వామి ఆరోపణపై భగ్గుమన్న టీవీ5 మూర్తి.. ఆయన మీద పోలీసు కంప్లైంట్ ఇచ్చారు. వేణుస్వామికి అర్థం లేని ఆరోపణలు అంటూ.. అటు ఫిల్మ్ జర్నలిస్టులు కూడా పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. వేణుస్వామి బాగోతం ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. మీడియా ముసుగులో తమని ఇబ్బందులకు గురిచేస్తున్నారని… తన సతీమణితో పాటు వేణుస్వామి ఆరోపించారు. 5 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారని.. ఓ ఫోన్ కాల్ ఆడియోను కూడా పంచుకున్నారు.
అంత డబ్బు ఇవ్వలేము, ఈ మాటలే మా మరణ వాగ్మూలం అంటూ.. వేణుస్వామి, వీణా శ్రీవాణి సంచలన కామెంట్లు చేశారు. ఇంత చేసినా.. వేణుస్వామి మీద సింపథీ రాకపోగా.. సోషల్ మీడియాలో మరింత టార్గెట్ చేస్తున్నారు. వేణుస్వామి.. ఇంతేనా నీ పవర్ అని ప్రశ్నిస్తున్నారు. అందరి జాతకాలు చెప్తావ్ కదా.. నీ జాతకం చూపించుకోకపోయావా.. ఇలా బెదిరింపులు ఏంటి అంటూ గట్టిగానే కడిగిపారేస్తున్నారు. తాను చెప్పింది జరుగుతుందని.. కంటి చూపుతో గ్రహాల మూమెంట్‌ను కంట్రోల్ చేస్తానని డబ్బా కొట్టే వేణుస్వామి.. ఇలాంటి విషయాలు భయపడడమా.. బాధపడడమా.. ఏమైంది స్వామీ మీకు అంటూ.. సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.
స్టేట్ నుంచి సెంట్రల్ వరకు చాలా పరిచయాలు ఉన్నాయని.. అందరికీ తానే జాతకం చెప్తానని.. మాములు సమయంలో బిల్డప్ ఇచ్చే వేణుస్వామి.. ఇలాంటి ఆరోపణలు చేయడం ఏంటి.. అదీ మీడియా ముందుకు సతీసమేతంగా వచ్చి ఆరోపణలు చేయడం ఏంటి అంటూ ఫైర్ అవుతున్నారు. నిజంగా నిజమైన ఆధారాలు ఉంటే.. ఇంత స్టేటస్ ఉండి.. ఫేస్ టు ఫేస్ యుద్ధం చేయాల్సింది పోయి.. ఇలాంటి బెదిరింపులు ఏంటి.. ఈ వీడియోలు ఏంటి అంటూ కామెంట్లు గుప్పిస్తున్నారు. నిజంగా బాధపడ్డారా.. ఇది కూడా పబ్లిసిటీ స్టంటా.. మీ ప్లాన్ ఏంటి వేణుస్వామి అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు. మరి ఈ పోలీస్ కంప్లైంట్ల తర్వాత… ఈ రచ్చ తర్వాత.. వేణుస్వామి నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి మరి.