ఐపీఎల్ మెగా వేలం రాజస్థాన్ వదిలేసేది వీరినే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ల మెగావేలంపైనే అందరి చూపు ఉంది. వేలానికి ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటకీ ఏ ఫ్రాంచైజీ ఎవరిని రిటైన్ చేసుకుంటుంది... ఎవరిని వదిలేస్తుందన్న వాటిపై విపరీతమైన ఆసక్తి నెలకొంది.

  • Written By:
  • Publish Date - September 5, 2024 / 05:12 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ల మెగావేలంపైనే అందరి చూపు ఉంది. వేలానికి ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటకీ ఏ ఫ్రాంచైజీ ఎవరిని రిటైన్ చేసుకుంటుంది… ఎవరిని వదిలేస్తుందన్న వాటిపై విపరీతమైన ఆసక్తి నెలకొంది. 4 లేదా ఐదుగురిని మాత్రమే రిటెన్షన్ చేసుకునే అవకాశముండడంతో ప్రతీ ఫ్రాంచైజీ కీలక ఆటగాళ్ళలో కొందరిని వదిలేయక తప్పని పరిస్థితి.. దీనిలో భాగంగా రాజస్థాన్ రాయల్స్ రిలీజ్ చేసే ప్లేయర్స్ ను చూస్తే పలువురు స్టార్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. రాజస్థాన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను వేలంలోకి వదిలేసే అవకాశాలున్నాయి. నిజానికి రాయల్స్ విజయాల్లో అశ్విన్ కూడా కీలకపాత్ర పోషించాడు. ఐదు కోట్లు పెట్టి అతన్ని కొనుగోలు చేయగా.. 45 మ్యాచ్ లలో 35 వికెట్లు తీశాడు. అదే సమయంలో బ్యాట్ తోనూ రాణించేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వేలంలోకి వదిలేసినా మళ్ళీ కొనుగోలు చేసే ఛాన్సుంది.

రాయల్స్ టీమ్ వదిలేసే ఆటగాళ్ళలో పేసర్ ప్రసిధ్ధ కృష్ణ తప్పనిసరిగా ఉంటాడని అర్థమవుతోంది. గత వేలంలో 10 కోట్లు పెట్టి ఈ పేసర్ ను కొనుగోలు చేసింది. అయితే ఫిట్ నెస్ సమస్యలు అతనికి మైనస్ గా మారాయి. గత సీజన్ లో ఫిట్ నెస్ కారణంగానే ఆడలేకపోయాడు. 2022 సీజన్ లో 19 మ్యాచ్ లలో 17 వికెట్లు తీసి ఆకట్టుకోగా… ఈ సారి వేలంలో ఆ స్థాయి ధర పలికే అవకాశాలు కనిపించడం లేదు. ఇక రాజస్థాన్ వేలంలోకి వదిలేసే మరో ఆటగాడు షిమ్రోన్ హెట్ మెయిర్… వెస్టిండీస్ కు చెందిన ఈ హిట్టర్ కు నిలకడ లేకపోవడం మైనస్ గా మారింది. హెట్ మెయిర్ ను గత వేలంలో 7 కోట్లకు పైగా వెచ్చించి తీసుకుంది. ఇప్పటి వరకూ 41 మ్యాచ్ లలో 726 పరుగులు చేసాడు. అయితే రైట్ టూ మ్యాచ్ నిబంధనల్లో మార్పులు జరిగితే మాత్రం అతన్ని మళ్ళీ కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో మెరుపు ఇన్నింగ్స్ లు ఆడుతున్న హెట్ మెయిర్ వేలంలోకి వస్తే మంచి ధర పలుకుతాడని అంచనా వేస్తున్నారు.