నన్నూ మోసం చేశారు, చీటింగ్ ఆరోపణలపై ఊతప్ప

ఉద్యోగుల పీఎఫ్‌ నిధుల విషయంలో మోసానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత క్రికెటర్ రాబిన్ ఊతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ అవడం కలకలం రేపింది.

  • Written By:
  • Publish Date - December 23, 2024 / 04:04 PM IST

ఉద్యోగుల పీఎఫ్‌ నిధుల విషయంలో మోసానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత క్రికెటర్ రాబిన్ ఊతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ అవడం కలకలం రేపింది. తాజాగా దీనిపై ఊతప్ప స్పందించాడు. సదరు కంపెనీలో తాను ఎలాంటి ఎగ్జిక్యూటివ్ రోల్ పోషించడం లేదని ఊతప్ప స్పష్టం చేశారు. పెట్టుబడి పెట్టడం వల్ల తనకు డైరెక్టర్ అన్న పదవి ఇచ్చారు తప్ప.. సంస్థ వ్యవహారాల్లో తాను ఎన్నడూ కల్పించుకోలేని వివరణ ఇచ్చారు. పెట్టబడి పెట్టిన నిధులను తిరిగి చెల్లించకుండా తనను మోసం చేశారని అన్నారు. తనపై పీఎఫ్‌ మోసం కేసు నమోదు కావడంతో.. తానేదో తప్పు చేసినట్లు అనేక వార్తలు వస్తున్నాయన్నారు. వాటికి వివరణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రకటన చేస్తున్నాని చెప్పారు.

తాను 2018-19లో సెంటారస్ లైఫ్ స్టైల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో డైరెక్టర్‌గా నియమితుడినయ్యాననీ, పెట్టబడి పెట్టడంతో పెట్టడంతో ఆ పదవి ఇచ్చారని చెప్పాడు. కానీ యాక్టివ్ ఎగ్జిక్యూటివ్ రోల్‌ను తానెన్నడూ పోషించలేదన్నాడు. బోర్డ్ అఫ్ డైరెక్టర్లు తీసుకునే నిర్ణయాల్లో ఎన్నడూ కల్పించుకోలేదు. క్రికెటర్‌గా, కామెంటేటర్‌గా, టీవీ ప్రెజెంటర్‌గా బిజీగా ఉండేవాడినని వివరణ ఇచ్చాడు. అందుకే కంపెనీ కార్యక్రమాల్లో ఎప్పుడూ పార్టిసిపేట్ చేయలేదనీ, కొన్నేళ్ల క్రితమే తాను ఆ పదవికి రాజీనామా చేసినట్టు చెప్పాడు. అలాగే మరికొన్ని సంస్థల్లోనూ తాను పెట్టుబడులు పెట్టాననీ, అక్కడా ఎన్నడూ ఎగ్జిక్యూటివ్‌గా విధులు నిర్వర్తించలేదన్నాడు.పీఎఫ్‌ నిధుల దుర్వినియోగంలో తన ప్రమేయం లేదని ఉతప్ప చెప్పాడు. త్వరలో ఈ సమస్యను అధిగమిస్తానని తెలిపాడు. ఆలోగా నిజాలను తెలుసుకొని మాత్రమే సమాచారం ఇవ్వాలని మీడియాకు విజ్ఞప్తి చేశాడు.