December 31 : డిసెంబర్ 31.. మత్తులో గీత దాటితే మటాషే..

ఎట్టేకేలకు ఇయర్‌ ఎండ్‌కు చేరుకున్నాం. డిసెంబర్‌ నెలలో స్టార్ట్‌ ఐన వెంటనే ప్రతీ ఒక్కరికీ గుర్తొచ్చేది థర్టీఫస్ట్ నైట్‌ పార్టీ. సంవత్సరం మొత్తం ఏం సాధించనివాళ్లు కూడా.. 31 రాత్రి ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తారు. తెల్లారితే జీవితాలు మారిపోతాయి. ఇదే ఆఖరి రోజు అన్నట్టు ఒళ్లు తెలియకుండా తాడి రోడ్లపై నానా హంగామా చేస్తారు. అంతా ఇలాగే ఉంటారు అని కాదు.. కానీ హైదరాబాద్‌ లాంటి సిటీస్‌లో మాత్రం ఇలాంటి బ్యాచ్‌లు చాలా కనిపిస్తాయి.

 

ఎట్టేకేలకు ఇయర్‌ ఎండ్‌కు చేరుకున్నాం. డిసెంబర్‌ నెలలో స్టార్ట్‌ ఐన వెంటనే ప్రతీ ఒక్కరికీ గుర్తొచ్చేది థర్టీఫస్ట్ నైట్‌ పార్టీ. సంవత్సరం మొత్తం ఏం సాధించనివాళ్లు కూడా.. 31 రాత్రి ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తారు. తెల్లారితే జీవితాలు మారిపోతాయి. ఇదే ఆఖరి రోజు అన్నట్టు ఒళ్లు తెలియకుండా తాడి రోడ్లపై నానా హంగామా చేస్తారు. అంతా ఇలాగే ఉంటారు అని కాదు.. కానీ హైదరాబాద్‌ లాంటి సిటీస్‌లో మాత్రం ఇలాంటి బ్యాచ్‌లు చాలా కనిపిస్తాయి. అందుకే అలాంటి జల్సా రాయుళ్ల ఆటకట్టించేందుకు.. న్యూ ఇయర్‌ వేడుకలమీద కఠినమైన ఆంక్షలు తీసుకువచ్చారు పోలీసులు. ఎలాంటి ఈవెంట్‌ నిర్వహించాలన్నా.. కనీసం పది రోజుల ముందే పోలీసులు పర్మిషన్‌ తీసుకోవాలని రూల్‌ పెట్టారు.

ఇక ఎవరు ఎంత ఎంజాయ్‌ చేసినా.. ఎంత పెద్ద పార్టీ ఆర్గనైజ్‌ చేసినా.. రాత్రి ఒంటిగంటలోపే దుకాణం బంద్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రతీ ఈవెంట్‌లో సీసీ కెమెరాలు తప్పనిసరి. డ్రగ్స్‌ తీసుకోవడం, ఆశ్లీల డాన్సులు చేయించడం, మైనర్లతో మందు కొట్టించడం చేస్తే. పార్టీ నుంచి నేరుగా జైలుకు వెళ్లాల్సిందే. ఈ విషయంలో నిందితులు ఎంత పెద్దవాళ్లైనా వదిలే ప్రసక్తే లేదంటున్నారు పోలీసులు. ఇక ఈవెంట్‌కు పర్మిషన్‌ వచ్చిన పెద్ద పెద్ద సౌండ్ సిస్టం ఏర్పాటు చేయడాన్ని నిషేదించారు. 45 డెసిబుల్స్‌ కంటే సౌండ్‌ మించకూడదని లిమిట్‌ పెట్టారు. అంతకన్నా ఎక్కువ సౌండ్‌తో డీజే, సాంగ్స్‌ ప్లే చేస్తే.. సౌండ్‌ సిస్టం సీజ్‌ చేస్తామంటూ వార్నింగ్‌ ఇచ్చారు. పార్టీలు చేసుకునేవాళ్లు కొందరైతే తాగిన తరువాత బైక్‌లు కార్లతో రోడ్లపై హంగామా చేసే బ్యాచ్‌ మరోటి ఉంటుంది. అలాంటి వాళ్లపై ఈసారి కొరడా ఝలిపించబోతున్నారు తెలంగాణ పోలీసులు.

తాగి బండి నడిపితే 10 వేలు ఫైన్‌తో పాటు 6 నెలలు జైలుశిక్ష, వీలైతే డ్రైవింగ్‌ లైసెన్స్‌ సస్పెన్స్‌ కూడా చేస్తామని చెప్తున్నారు. ఇలా తాగి బండి నడిపేవాళ్ల కారణంగా ప్రతీ సంవత్సరం చాలా యాక్సిడెంట్స్‌ జరుగుతున్నాయి. తాగి వాళ్ల ప్రాణాలను రోడ్డుపై పనంగా పెట్టడమే కాకుండా.. ఎదురుగా వచ్చేవాళ్ల జీవితాలను కూడా బలి చేస్తున్నారు కొందరు తాగుబోతులు. అలాంటి తప్పులు ఈ సంవత్సరం జరగకుండా చూస్తామంటున్నారు పోలీసులు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలంటే.. ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు.