ఆ ఆరుగురు ఖాయం ఢిల్లీ రిటెన్షన్ లిస్ట్ ఇదే

ఐపీఎల్ మెగావేలానికి సంబంధించి రిటెన్షన్ రూల్స్ ను బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. ఫ్రాంచైజీలకు కిక్ ఇచ్చేలా ఐదుగురు ఆటగాళ్ళను రిటైన్ చేసుకోవడంతో పాటు మరో ప్లేయర్ ను ఆర్టీఎం ఆప్షన్ ద్వారా తీసుకునే వెసులుబాటు ఇచ్చింది.

  • Written By:
  • Updated On - October 1, 2024 / 12:16 PM IST

ఐపీఎల్ మెగావేలానికి సంబంధించి రిటెన్షన్ రూల్స్ ను బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. ఫ్రాంచైజీలకు కిక్ ఇచ్చేలా ఐదుగురు ఆటగాళ్ళను రిటైన్ చేసుకోవడంతో పాటు మరో ప్లేయర్ ను ఆర్టీఎం ఆప్షన్ ద్వారా తీసుకునే వెసులుబాటు ఇచ్చింది. దీంతో ప్రతీ ఫ్రాంచైజీ తమ ఆరుగురు రిటైన్ ప్లేయర్స్ జాబితాపై కసరత్తు పూర్తి చేసుకుంటున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ జాబితాను చూస్తే కెప్టెన్ రిషబ్ పంత్ ను కొనసాగించడం ఖాయం. పంత్ ను రిలీజ్ చేస్తారన్న వార్తలను పూర్తిగా కొట్టిపారేసి డీసీ యాజమాన్యం తమ మొదటి ఛాయిస్ అతనేని తేల్చి చెప్పింది. అలాగే యువ ఆటగాడు జాక్ ఫ్రేజర్ మెకర్గ్ ను కూడా ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోనుంది. గత ఐపీఎల్ లో ఆకట్టుకున్న ఫ్రేజర్ టాపార్డర్ లో కీలకం కానున్నాడని భావిస్తోంది.

అలాగే సౌతాఫ్రికా క్రికెటర్ స్టబ్స్ ను కూడా ఢిల్లీ తమతో పాటే కొనసాగించుకోనుంది. మ్యాచ్ విన్నర్ గా పేరు తెచ్చుకున్న ఈ సఫారీ ప్లేయర్ గత సీజన్ లో 378 రన్స్ చేశాడు. ఒత్తిడిలో బాగా బ్యాటింగ్ చేయగల సత్తా ఉంది. ఇదిలా ఉంటే ఢిల్లీ ఖచ్చితంగా రిటైన్ చేసుకునే మరో ప్లేయర్ అక్షర్ పటేల్…ఆల్ రౌండర్ కోటాలో జట్టుకు మేజర్ అడ్వాంటేజ్ గా మారిన అక్షర్ పటేల్ గత సీజన్ లో 11 వికెట్లు తీయడంతో పాటు 235 రన్స్ చేశాడు. ఇక స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను కూడా ఢిల్లీ ఎట్టిపరిస్థితుల్లో వదులుకోదు. రిస్ట్ స్పిన్నర్ గా భారత ప్రపంచ కప్ విజయంలో కీలకపాత్ర పోషించిన కుల్దీప్ ఢిల్లీకి కీలకమైన ప్లేయర్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. గత సీజన్ లో 11 మ్యాచ్ లు ఆడి 16 వికెట్లు పడగొట్టాడు. కాగా వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్ ను కూడా ఢిల్లీ రిటైన్ చేసుకోనుంది. పోరెల్ ఇంకా టీమిండియాకు ఆడకపోయినప్పటకీ అతని సామర్థ్యంపై డీసీ మేనేజ్ మెంట్ కు మంచి నమ్మకం ఉంది.