CITY HEATLANDS : హైదరాబాద్ లో హీట్ ఐలాండ్స్ ఇవే.. భవిష్యత్తులో ఇక్కడ బతకడం కష్టమే

హైదరాబాద్ అర్భన్ ల్యాబ్ అనే సంస్థ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన డేటా చూస్తే... సిటీలో కొన్ని ప్రాంతాల్లో నివసించడం కష్టమే అనిపిస్తోంది. సిటీలో 7 ప్రాంతాల్లో ఈ మార్చిలో భూఉపరితల ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయి.

గతంలో కంటే ఈసారి ఎండలు మండిపోతున్నాయి. ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ హై టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి. జనరల్ గా హైదరాబాద్ లో ప్రతి యేటా ఎండలు తక్కువగా ఉండేవి. ఇక్కడ చెట్లు ఎక్కువగా ఉండటమే ఇందుక్కారణం. కానీ ఈసారి హైదరాబాద్ లోనూ జనం మాడు పగులుతోంది. కాంక్రీట్ జంగిల్ సిటీ నిప్పుల కుంపటిగా మారింది.

హైదరాబాద్ అర్భన్ ల్యాబ్ అనే సంస్థ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన డేటా చూస్తే… సిటీలో కొన్ని ప్రాంతాల్లో నివసించడం కష్టమే అనిపిస్తోంది. సిటీలో 7 ప్రాంతాల్లో ఈ మార్చిలో భూఉపరితల ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయి. వీటినే అర్భన్ హీట్ ల్యాండ్స్ గా సంస్థ గుర్తించింది. భూ ఉపగ్రహం, గూగుల్ ఎర్త్ లోని ఉష్ణోగ్రతల సమాచారాన్ని విశ్లేషించింది. నగరంలోని పటాన్ చెరు, బండ్లగూడ, గచ్చిబౌలి, మైలార్ దేవ్ పల్లి, బీఎన్ రెడ్డి నగర్, మన్సూరాబాద్, హయత్ నగర్ ని హీట్ ఐలాండ్స్ గా గుర్తించింది అర్భన్ ల్యాబ్ సంస్థ.

హైదరాబాద్ మొత్తమ్మీద 43 నుంచి 44 డిగ్రీల టెంపరేచర్ నమోదవగా… ఈ ఏడు ప్రాంతాల్లో భూ ఉపరితలం మీద రెండు మీటర్ల ఎత్తులో 48 నుంచి 49 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో చెట్లు కొట్టివేయడం, కాంక్రీట్ నిర్మాణాలు… వేడిని గ్రహించే వస్తువులు ఉండటం, పక్కాఇళ్ళు, బీటీ రోడ్లతో సూర్యుడి వేడి ఎక్కువగా వాతావరణంలోకి అబ్సార్బ్ అవుతోంది. ఇండ్లల్లో వాడే ఏసీలు, ఫ్రిజ్ లతో సర్ఫేస్ టెంపరేచర్లు పెరిగిపోతున్నాయి. అందుకే హీట్ ఐల్యాండ్స్ గా మారుతున్నట్టు రీసెర్చ్ లో తేలిపింది. ఇక్కడ జనం కనీసం భూమి మీద నిలబడలేని పరిస్థితి ఉంటుంది.

హీట్ ఐలాండ్స్ పెరగడం వల్ల ఎక్కువ పేద, మధ్యతరగతి జనం ఇబ్బందులు పడుతున్నారు. రేకుల షెడ్లు, బస్తీల్లో ఇరుకు ఇళ్ళల్లో ఉండే జనం ఎండలకు అల్లాడిపోతున్నారు. రేకుల ఇళ్ళల్లో టెంపరేచర్ విపరీతంగా పెరిగిపోతోంది. సర్ఫేస్ టెంపరేచర్ల వల్లే వడగాలులు తీవ్రత పెరుగుతోంది. సాయంత్రానికి గాలులు చల్లబడినా… ఈ ఏడు ప్రాంతాల్లో భూమిలోకి వెళ్ళిన వేడి… రాత్రిపూట బయటకు వస్తోంది. దాంతో జనానికి నరకం కనిపిస్తోంది.

హైదరాబాద్ లో క్రమంగా హీట్ ఐలాండ్స్ పెరుగుతాయనీ… చెట్లను పెంచి పచ్చదనాన్ని విస్తరిస్తే తప్ప పరిస్థితి అదుపులోకిరాదంటున్నారు నిపుణులు. వెహికిల్స్ నుంచి వచ్చే కాలుష్యాలను కూడా తగ్గించాలని సూచిస్తున్నారు. లేకపోతే రాబోయే రోజుల్లో హైదరాబాద్ లో బతకడం కష్టమేనని హెచ్చరిస్తున్నారు.