అసలు నాంపల్లి కోర్ట్ లో ఏం జరిగింది…? అక్కినేని ఫ్యామిలీ ఏం చెప్పింది…?

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో పెద్ద దుమారమే రేగింది సినీ రాజకీయ వర్గాల్లో. కేటిఆర్ కు గురిపెట్టిన బాణం అక్కినేని ఫ్యామిలీకి తగిలి... ఆ బాణం పీకడానికి అక్కినేని ఫ్యామిలీ వంద కోట్లకు డిమాండ్ చేస్తోంది. నేడు కోర్ట్ లో దీనిపై విచారణ జరిగింది.

  • Written By:
  • Publish Date - October 8, 2024 / 05:34 PM IST

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో పెద్ద దుమారమే రేగింది సినీ రాజకీయ వర్గాల్లో. కేటిఆర్ కు గురిపెట్టిన బాణం అక్కినేని ఫ్యామిలీకి తగిలి… ఆ బాణం పీకడానికి అక్కినేని ఫ్యామిలీ వంద కోట్లకు డిమాండ్ చేస్తోంది. నేడు కోర్ట్ లో దీనిపై విచారణ జరిగింది. నాంపల్లి కోర్టుకు కుటుంబ సభ్యులతో కలిసి అక్కినేని నాగార్జున వచ్చారు. భార్య అమల, కొడుకులు నాగచైతన్య, అఖిల్, మేనకోడలు సుప్రియ హాజరు అయ్యారు. ఈ కేసులో సాక్షులుగా సుప్రజ, వెంకటేశ్వర్లు ఉన్నారు. అసలు అక్కినేని ఫ్యామిలీ కోర్ట్ లో ఏ వాదనలు వినిపించింది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు ఎంతమంది వంటి వివరాలను ఓ లుక్ వేద్దాం…

దేనికోసం పిటిషన్ ఫైల్ చేసారని నాగార్జునను న్యాయమూర్తి ప్రశ్నించారు. నాగార్జున తన వాంగ్మూలాన్ని తెలుగులో వినిపించగా నమోదు ప్రజాప్రతినిధుల స్పెషల్ కోర్టు నమోదు చేసింది. సినిమా రంగం ద్వారా మా కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని మా కుటుంబం పట్ల ప్రజల ఆధారాభిమానాలు ఉన్నాయని పేర్కొన్నారు నాగార్జున. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయని సినిమా రంగం తో పాటు సామజిక సేవా కార్యక్రమాలు సైతం చేస్తున్నామని ఆయన తెలిపారు. మా కొడుకు విడాకులు మాజీ మంత్రి కేటీఆర్ వలన అంటూ మంత్రి అసభ్యంగా మాట్లాడారని జడ్జి ముందు భావోద్వేగానికి లోనయ్యారు.

అలా మాట్లాడం వలన మా పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లిందని తెలిపిన నాగార్జున మంత్రి కొండా సురేఖ ఫై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్ట్ ని కోరారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటలు అన్ని అసత్య ఆరోపణలు అని కోర్ట్ కి తెలిపారు. రాజకీయ దురుద్దేశ్యం తోనే మంత్రి ఇలాంటి వాఖ్యలు చేసిందని ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న తన కుటుంబం తీవ్ర మనో వేదనకు గురైందని ఆయన పేర్కొన్నారు. మంత్రి మాట్లాడిన మాటలు అన్ని టెలివిజన్ ఛానెల్స్ లో ప్రసారం చేసాయని ఆవేదన వ్యక్తం చేసారు. అన్ని పేపర్స్ ప్రచురితం చేసాయనన్నారు.

మొదటి సాక్షిగా ఉన్న సుప్రియ కోర్ట్ లో తన వాదన వినిపించారు. మొదట న్యూ చానల్స్ లో నాగార్జున కుటుంబం పై కొండ సురేఖ వ్యాఖ్యలను చూసి నాగార్జున గారికి చెప్పానన్నారు ఆమె. ఆ వ్యాఖ్యలు చూసి షాక్ కి గురయ్యానని కోర్ట్ కి తెలిపారు. మరుసటి రోజు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు నేషనల్ మీడియాలో కూడా ప్రసారం చేశారన్నారు. మంత్రి చేసిన వాఖ్యలు వల్ల నాకు చాలా మంది నుండి ఫోన్ కాల్స్ వచ్చాయని మంత్రి చేసిన వాఖ్యలను జడ్జ్ ముందు చదివి వినిపించారు సుప్రియ. మంత్రి చేసిన వ్యాఖ్యల కారణంగా వల్ల మా కుటుంబం లో మనశ్శాంతి లేకుండా పోయిందని సాక్ష్యం చెప్పారు.

ఆ సమయంలో నాగార్జున వైజాగ్ లో ఉన్నారని నాగార్జున వైజాగ్ నుండి హైదరాబాద్ కు తిరిగి వచ్చిన తర్వాత వెళ్లి నాగార్జునను కలిశానని మంత్రి వ్యాఖ్యలపై కుటుంబమంతా కలిసి చర్చించామని జడ్జి ముందు వివరించారు. మంత్రి చేసిన వ్యాఖ్యలను సినిమా పరిశ్రమ మొత్తం ఖండించిందని రాజకీయ నాయకులు సినిమా పరిశ్రమ టార్గెట్ గా చేసుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆమె తన వాంగ్మూలం వినిపించారు. ఇక విచారణ అక్టోబర్ 10వ తేదీకి విచారణ వాయిదా వేసిన కోర్ట్… అక్టోబర్ 10వ తేదీన రెండోవ సాక్షి వెంకటేశ్వర్లు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని తెలిపింది.