ఇదేం పాయింట్ సిస్టమ్, WTC పై బెన్ స్టోక్స్ విమర్శలు

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల విధానంపై ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తీవ్ర విమర్శలు చేశాడు. ఈ పాయింట్స్ సిస్టమ్ తనకు ఏరోజూ అర్థం కావడం లేదంటూ వ్యాఖ్యానించాడు. పనికిమాలిన విధానంగా కనిపిస్తోందంటూ సెటైర్లు వేశాడు.

  • Written By:
  • Publish Date - November 29, 2024 / 03:40 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల విధానంపై ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తీవ్ర విమర్శలు చేశాడు. ఈ పాయింట్స్ సిస్టమ్ తనకు ఏరోజూ అర్థం కావడం లేదంటూ వ్యాఖ్యానించాడు. పనికిమాలిన విధానంగా కనిపిస్తోందంటూ సెటైర్లు వేశాడు.
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ కొన్నేళ్ళుగా ఆడుతున్నా ఇప్పటికీ గందరగోళంగా అనిపిస్తోందని వ్యాఖ్యానించాడు. ఒక్క మ్యాచ్ గెలిస్తే టాప్‌లోకి వెళ్తామనూ, మరో మ్యాచ్ ఓడిపోతే ఒక్కసారిగా కిందకి పడిపోతీమన్నాడు. అందుకే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌‌ పాయింట్ల పట్టికను అస్సలు పట్టించుకోవడం లేదని స్టోక్స్ చెప్పుకొచ్చాడు. తాము చాలా రోజులుగా మంచి క్రికెట్ ఆడుతున్నామనీ, మంచి ఫలితాలే అందుకుంటున్నా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మాత్రం వెనుకబడుతున్నామంటూ విశ్లేషించాడు.

దాని కోసం ఏం చేయాలో తనకు అర్థం కావడం లేదంటూ చెప్పుకొచ్చాడు. బెన్ స్టోక్స్ కెప్టెన్ అయ్యాక బజ్ బాల్ కాన్సెప్ట్‌తో ఇంగ్లాండ్ వరుస విజయాలతో దుమ్మురేపుతోంది. మాజీ కెప్టెన్ జో రూట్ పరుగుల వరద పారిస్తుండగా.. మరికొందరు స్టార్ ప్లేయర్స్ కూడా రాణిస్తున్నారు. వరుస విజయాలు అందుకుంటున్నప్పటికీ ఫైనల్ బెర్త్ రేసులో మాత్రం వెనుకబడింది మొదటి రెండు సార్లు నాలుగో స్థానంలో ముగించిన ఇంగ్లాండ్, ఈసారి ఏకంగా ఆరో స్థానంలో నిలిచింది. మ్యాచ్ అయ్యాక మ్యాచ్ మీద ఫోకస్ పెడుతున్నామనీ స్టోక్స్ చెప్పాడు. మిగిలిన జట్ల కంటే మేం చాలా మ్యాచులు ఆడుతున్నామన్న స్టోక్స్ ఈ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్ చాలా కన్ఫ్యూజన్ గా ఉందన్నాడు.

ఎక్కువ మ్యాచులు ఆడడం వల్లే కమకు ఫైనల్ ఆడే ఛాన్స్ రావడం లేదేమో అంటూ సెటైర్లు కూడా వేశాడు. ఈ ఏడాది ఇండియాలో జరిగిన టెస్టు సిరీస్‌ని 1-4 తేడాతో కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు, పాకిస్తాన్‌లో తొలి టెస్టు నెగ్గిన తర్వాత వరుసగా రెండు టెస్టుల్లో చిత్తుగా ఓడింది. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో సిరీస్ ఆడుతున్న ఇంగ్లాండ్ దీనిలో గెలిచినా డబ్ల్యూటీసీ ఫైనల్‌కి క్వాలిఫై కాలేదు అయితే ఈ టెస్టు సిరీస్‌ని 3-0 తేడాతో ఇంగ్లాండ్ ఓడిపోతే మాత్రం న్యూజిలాండ్‌కి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే ఛాన్సులు పెరుగుతాయి..