కవిత విడుదల ప్రాసెస్ ఇదే

ఎమ్మెల్సీ కవిత కు సుప్రీం కోర్ట్ బెయిల్ మంజూరు చేయడంతో బయటకు తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ నేతలు పరుగులు తీస్తున్నారు. గం. 4.00 లోపల ట్రయల్ కోర్టులో షూరిటీ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

  • Written By:
  • Publish Date - August 27, 2024 / 03:16 PM IST

ఎమ్మెల్సీ కవిత కు సుప్రీం కోర్ట్ బెయిల్ మంజూరు చేయడంతో బయటకు తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ నేతలు పరుగులు తీస్తున్నారు. గం. 4.00 లోపల ట్రయల్ కోర్టులో షూరిటీ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆ తరువాత ట్రయల్ కోర్టు నుంచి మెయిల్ ద్వారా జైలు అధికారులకు సమాచారం అందుతుంది. ఆ తరువాత మరో రెండు మూడు గంటల పాటు జైలు లో బెయిల్ విడుదల సన్నాహాలు జరుగుతాయి.

రాత్రి 7:00 తర్వాత జైలు నుంచి కవిత బయటకు వస్తారు. ఈరోజు రాత్రికి ఢిల్లీలోనే కవిత, కేటీఆర్, హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నేతలు ఉండనున్నారు. రేపు ఉదయం ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అనంతరం రేపు మధ్యాహ్నం గం. 2.00కు హైదరాబాదుకు కవిత, కేటీఆర్, హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నేతలు రానున్నారు. నేడు ఆమెకు సిబిఐ, ఈడీ కేసుల్లో బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.