ఆ ఇద్దరికే రూ.36 కోట్లు రాజస్థాన్ రిటెన్షన్ లిస్ట్ ఇదే

ఐపీఎల్ మెగా వేలం కోసం ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయి. నవంబర్ చివరి వారంలో వేలం జరగనుండగా... రిటెన్షన్ జాబితాపై ఫ్రాంచైజీలు కసరత్తు చేస్తున్నాయి. ఆరుగురిని రిటైన్ చేసుకునే అవకాశం కల్పించిన బీసీసీఐ వారికి ఎంత మొత్తం చొప్పున చెల్లించాలో కూడా డిసైడ్ చేసింది.

  • Written By:
  • Publish Date - October 15, 2024 / 03:42 PM IST

ఐపీఎల్ మెగా వేలం కోసం ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయి. నవంబర్ చివరి వారంలో వేలం జరగనుండగా… రిటెన్షన్ జాబితాపై ఫ్రాంచైజీలు కసరత్తు చేస్తున్నాయి. ఆరుగురిని రిటైన్ చేసుకునే అవకాశం కల్పించిన బీసీసీఐ వారికి ఎంత మొత్తం చొప్పున చెల్లించాలో కూడా డిసైడ్ చేసింది. రిటైన్ చేసుకునే ఆటగాళ్ల కోసం 75 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రతీ జట్టు పర్స్ వాల్యూను 120 కోట్లకు పెంచింది. రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా 18 కోట్లు, 14 కోట్లు, 11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, ఐదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి 18 కోట్లు, 14 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అన్ క్యాప్డ్ ప్లేయర్స్ కు 4 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. దీని ప్రకారం చూస్తే రాజస్థాన్ రాయల్స్ రిటైన్ జాబితాలో 18 కోట్ల కేటగిరీలో ఎవరుంటారనేది ఆసక్తికరంగా మారింది.

కెప్టెన్ సంజూ శాంసన్ రాయల్స్ మొదటి ఛాయిస్ గానే ఉంటాడని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో సంజూకి 18 కోట్లు ఖాయం.. శాంసన్ కెప్టెన్సీలోనే రాజస్థాన్ రెండుసార్లు ఫైనల్ కు చేరింది. రాయల్స్ రెండో ఛాయిస్ గా ఓపెనర్ జాస్ బట్లర్ ఉంటాడని చెప్పొచ్చు. బట్లర్ ను 14 కోట్లు పెట్టి రిటైన్ చేసుకోనుంది. గత సీజన్ లో బట్లర్ అదరగొట్టాడు. రెండు సెంచరీలు బాదిన ఈ ఇంగ్లాండ్ క్రికెటర్ 359 పరుగులు చేశాడు. అలాగే మూడో ఛాయిస్ గా యువ ఆటగాడు రియాన్ పరాగ్ ను 11 కోట్లు చెల్లించి తీసుకుంటుందని తెలుస్తోంది. అయితే నాలుగో రిటెన్షన్ ప్లేయర్ గా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ను రాజస్థాన్ ఎంచుకోవడం ఖాయమని చెప్పొచ్చు. గత కొన్ని సీజన్లుగా జైశ్వాల్ ఐపీఎల్ లో పరుగుల వరద పారిస్తున్నాడు. 2024 సీజన్ లో జైశ్వాల్ ఒక సెంచరీతో సహా 435 పరుగులు చేశాడు.

ఇదిలా ఉంటే అన్ క్యాప్డ్ కేటగిరీలో రాజస్థాన్ రాయల్స్ పేస్ బౌలర్ సందీప్ శర్మను రిటైన్ చేసుకునే అవకాశాలున్నాయి. గత సీజన్ లో వేలంలో అమ్ముడుకాని సందీప్ ను రీప్లేస్ మెంట్ గా తీసుకుంది. ఆ సీజన్ లో అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్న సందీప్ శర్మ 11 మ్యాచ్ లలో 11 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా డెత్ ఓవర్స్ లో రాజస్థాన్ రాయల్స్ కు కీలకం మారడంతో అతన్ని 4 కోట్లకు దక్కించుకోనుంది. ఇక రైట్ టూ మ్యాచ్ ఆప్షన్ ద్వారా ఆవేశ్ ఖాన్ తో పాటు మరికొన్ని ఆప్షన్స్ రాజస్థాన్ ముందున్నాయి.