Telangana BJP: తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల ప్రకటన జాప్యం వెనుక అసలు కారణం ఇదేనా..?

తెలంగాణలో బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించే విషయంలో మీన మేషాలు లెక్కింస్తోది. శనివారం 55 మందిలో కూడిన తొలిజాబితా విడుదల అవుతుందని అందరూ భావించారు. అయినప్పటికీ ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. దీనికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.

  • Written By:
  • Updated On - October 22, 2023 / 08:53 AM IST

తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ కి సమయం దగ్గర పడుతుండటంతో బీజేపీ ఇంకా ఎలాంటి అభ్యర్ధుల జాబితా విడుదల చేయలేదు. దీనికి కారణం కొందరి విషయంలో ఏకాభిప్రాయం కుదరక పోవడమే అంటున్నారు. 35 నుంచి 40 స్థానాల్లో అభ్యర్థులు పక్కాగా ఉన్నప్పటికీ మిగిలిన వారిపై స్పష్టత రవడం లేదంటున్నరు. అభ్యర్థుల పేర్లు ఖరారైన వారికి నిన్న సాయంత్రం కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫోన్ చేసి ప్రచార కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసుకోవల్సిందిగా చెప్పినట్లు తెలుస్తోంది.అయితే మిగిలిన 15 నుంచి 20 స్థానాలపై ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఆదివారం సాయంత్రం తుది జాబితాను విడుదల చేయనున్నట్లు చెబుతున్నారు.

కాంగ్రెస్ రెండవ జాబితా..

కాంగ్రెస్ తెలంగాణ ఎన్నికల బరిలో తనదైన వ్యూహాత్మక కథనాన్ని నడిపిస్తోంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. ఇందులో భాగంగా తొలిజాబితాను విడుదల చేసింది. ఇందులో అవకాశం దక్కని వారు కాంగ్రెస్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వారు పార్టీ మారేందుకు అవకాశాలు వెతుక్కుంటున్నట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ రెండవ జాబితా విడుదలైతే అందులో అవకాశం దక్కని వారు బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. అందుకే అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంలో ఆలస్యం జరిగినట్లు చెబుతున్నారు.

బీఆర్ఎస్ అసమ్మతి నేతలు..

బీఆర్ఎస్ నెల రోజుల క్రితమే అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా ఎన్నికల ప్రచార బరిలోకి దిగింది. ఈ పార్టీలో అవకాశం దక్కని వారు బీజేపీ, కాంగ్రెస్లో టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. తొలి ప్రాధాన్యతను కాంగ్రెస్ కు అక్కడ కూడా అవకాశం లభించకుంటే బీజేపీలో చేరే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే వారిని వస్తే కలుపుకుని వెళ్లేలా ప్రణాళికలు రచిస్తోంది బీజేపీ. ఈ విషయంలో కూడా కొంత జాప్యం జరిగినట్లు సమాచారం.

బీజేపీతో జనసేన పొత్తు..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలిపించారు. తెలంగాణలో పోటీ నుంచి తప్పుకుని తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. దీనికి నిరాకరించిన పవన్ ఆలోచించి చెబుతాను రెండు రోజుల సమయం కోరారు. దీంతో సీట్ల పంపకాల విషయాల్లో ఎవరికి ఏ స్థానాలు కేటాయించాలి అనే అంశంపై నీలినీడలు అలుముకున్నాయి. ఒకవేళ పవన్ కలిసి వస్తే వాళ్ళకు ఏ స్థానాలు అవసరమవుతాయో దీనిపై కూడా స్పష్టత కోసం ఎదురుచూసింది. అందుకే తీవ్రంగా జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. చివరిక పవన్ తన అభిప్రాయాన్ని ఇప్పటి వరకూ చెప్పలేదు. దీంతో తానే స్వయంగా బరిలోకి దిగేందుకు రంగం సిద్దం చేసుకుంది బీజేపీ.

T.V.SRIKAR