ఎక్కడ మొదలైందో.. ఎలా మొదలైందో కానీ.. జగన్, షర్మిల మధ్య విభేదాలు పీక్స్‌కు చేరుకున్నాయ్. ఒకరి మొహం ఒకరు చూసుకోవడానికి కూడా కనీసం ఇష్టపడడం లేదు. వైఎస్ జయంతి రోజు ఇడుపులపాయలో జరిగిన పరిణామాల గురించి.. రాష్ట్రం ఇంకా మాట్లాడుకుంటోంది. తండ్రికి నివాళులు అర్పించేందుకు కూడా జగన్, షర్మిల విడివిడిగా రావడం.. వాళ్లిద్దరి మధ్య ఎంత దూరం పెరిగిందో చెప్పకనే చెప్పింది. దీంతో ఆ తల్లి పడిన ఆవేదన అంతాఇంతా కాదు. అందరి కుటుంబ సభ్యుల అందరి ముందు.. వైఎస్ సాక్షిగా విజయమ్మ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ తల్లి పెట్టుకున్న కన్నీళ్లు.. ప్రతీ మనసును కదలిపిస్తున్నాయ్. జగన్, షర్మిల మధ్య విభేదాలకు కారణం ఏదైనా సరే.. వాళ్ల మొండితనమే ఆ దూరాన్ని మరింత పెంచిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. నిజానికి ఒకప్పుడు అన్న కోసం చెల్లి.. చెల్లి కోసం అన్న అన్నట్లుగా ఇద్దరు కనిపించేవారు. జగన్ జైలులో ఉన్న టైమ్‌లో పార్టీని నిలబెట్టడంలో పార్టీకి జనాల్లో మంచి గుర్తింపును తీసుకురావడంలో షర్మిల సూపర్ సక్సెస్ అయ్యారు. అలాంటి షర్మిల ప్రస్తుతం జగన్‌కు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారు. వైఎస్ ఫ్యామిలీలో విబేధాలను కడప కూడా డైజెస్ట్ చేసుకోవడం లేదు. సొంత చెల్లికి న్యాయం చేయలేని జగన్… ఏపీ జనాలకు ఏం న్యాయం చేస్తారంటూ జరిగిన ప్రచారం వైసీపీని ఊహించని స్థాయిలో దెబ్బతీసింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఆస్తుల వల్లే జగన్ షర్మిల మధ్య గ్యాప్ వచ్చిందని ప్రచారం జరుగుతున్నా.. అసలు కారణాలు వేరే ఉండొచ్చని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.
షర్మిల అస్తులే ముఖ్యమని అనుకుంటే లీగల్‌గా కోర్టుకు వెళ్లి కూడా సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉంది. అయితే షర్మిల మాత్రం ఆ రూట్ లో అడుగులు వేయడం లేదు. జగన్, షర్మిల మధ్య గ్యాప్‌కు చిన్నచిన్న సమస్యలే కారణమైతే… విజయమ్మ ఆ సమస్యలను సులువుగానే పరిష్కరించేవారు. పార్టీకి సంబంధించి జగన్, షర్మిల మధ్య గ్యాప్ వచ్చి ఉండవచ్చని కామెంట్లు వినిపిస్తున్నాయ్. ఇవేవి జరగడం లేదు అంటే.. ఇద్దరి మధ్య అంతకుమించి కారణం ఏదైనా ఉండి ఉండాలి. తగ్గేదే లే అన్నట్లు కనిపిస్తున్న ఇద్దరి గుణమే.. ఈ దూరానికి మరింత కారణం అవుతుందనే చర్చజరుగుతోంది. దూరం పెరగాడనికి ఇద్దరిలో ఎవరు కారణం అయినా.. ఆ ఇద్దరి తల్లి విజయమ్మ మాత్రం అల్లాడుతోంది. అటు షర్మిల వైపా.. ఇటు జగన్ వైపా అనే సందిగ్ధంలో ప్రతీసారి ఇబ్బందులు పడుతూనే ఉంది. దీంతో ఇప్పుడు వైఎస్ అభిమానులు కొత్త చర్చ మొదలుపెట్టారు. ఆ తల్లిని బాధపెట్టకండయ్యా అంటూ పోస్టులు పెడుతున్నారు.