ఢిల్లీ లిక్కర్ స్కాంలో (Delhi Liquor Scam) కవిత అరెస్ట్ (Kavita Arrest) అవ్వడం.. బీఆర్ఎస్ (BRS) పార్టీని షేక్ చేసింది. తనిఖీలు నిర్వహిస్తామని వచ్చిన అధికారులు కవితను అరెస్ట్ చేసి తీసుకువెళ్లడంతో ఒక్కసారిగా పరిస్థితి తలకిందులయ్యింది. అసలు ఈ కేసులో ఏం జరిగింది. మొదట కవితను సాక్షిగా పేర్కొన్న అధికారులు.. తరువాత దోషిగా ఎందుకు చేర్చారు. ఈ కేసులో 292 కోట్ల వ్యవహారంలో కవిత పాత్ర ఏంటి. ఇదే ఇప్పుడు అందరిలో ఉన్న అనుమానం. లిక్కర్ స్కాంకు సంబంధించిన 292 కోట్ల వ్యవహారంలో కవితకు సంబంధం ఉందని తేల్చారు ఈడీ అధికారులు. ఢిల్లీలోని మద్యం దుకాణాలు 60శాతం ప్రభుత్వ ఆధీనంలో, 40 శాతం ప్రైవేట్ ఆధీనంలో ఉండేవి. కానీ వీటిని 100 శాతం ప్రైవేట్‌కు ఇవ్వాలని నిర్ణయించింది ఢిల్లీ ప్రభుత్వం. దీనికోసమే కొత్త మద్యం పాలసీని తీసుకువచ్చింది.
ఈ పాలసీని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఆప్ ప్రతిధులకు 100 కోట్లు లంచం ఇచ్చారు అనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఈ మొత్తం వ్యవహారాన్ని కవిత వెనకుండి నడిపించారు అనేది ఆమెపై ఉన్న ఆరోపణ. స్కీంను తమకు అనుకూలంగా తయారు చేసేందుకు 100 కోట్లు హవాలా రూపంలో ఆప్‌కు చేర్చినట్టు గుర్తించారు అధికారులు. హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్‌లో విజయ్‌నాయర్, అమిత్ అరోరాతో కవిత పలుమార్లు భేటీ అయ్యారు. ఢిల్లీలోని సోడాపూర్ వద్ద రెండు బ్యాగుల్లో ఈ డబ్బును నగతిని వినోద్ చౌహాన్‌కు అందించారు. శరత్, మాగంటి, రామచంద్రపిళ్లై ఇండోస్పిరిట్‌లకు లబ్ధి చేకూరేలా స్కీంను తయారు చేయించుకున్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో కింగ్ పిన్.. కల్వకుంట్ల కవిత. ఈ డీల్ చేసినందుకు గానూ కవితకు ఢిల్లీ నుంచి 192 కోట్లు వచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. ఈ డబ్బుతో కవిత పెద్ద మొత్తంలో ఆస్తులు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఈ డబ్బుతో కొన్న అన్ని ఆస్తుల వివరాలనున సేకరించారు. ఇవి కాకుండానే మరో 292 కోట్ల లావాదేవీలు ఈ స్కాంలో జరిగినట్టు గుర్తించారు అధికారులు. ప్రస్తుతం వాటికి సంబంధించిన వివరాలు కవిత నుంచి రాబట్టే పనిలో ఉన్నారు. మనీష్ సిసోడియా, అమిత్ అరోరా, విజయ్ నాయర్‌తో కవిత చాలాసార్లు భేటీ అయ్యారు.
ఈ మీటింగ్స్‌లో ఏం మాట్లాడుకున్నారు. ఆ 292 కోట్లు కూడా కవితకే ముట్టాయా. అదే నిజమైతే ఆ డబ్బును కవిత ఏం చేశారు.
ఒకవేళ్ కవితకు రాకపోతే ఆ డబ్బు ఏమైనట్టు. ఇదే ఇప్పుడు కవిత నుంచి రావాల్సిన ఇన్ఫర్మేషన్. కవిత ఫోన్ల డేటా ఉండి ఉంటే.. అసలు ఈ వ్యవహారంలో కవిత ఏ మేరకు ఇన్వాల్స్ అయ్యింది అనే విషయం పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేది. కానీ.. ఆ డేటాను కవిత తొలగించారు. కానీ ఫేస్ టైం వాడుతున్నానని చెప్పి కోర్టులో బుక్ అయ్యారు. ఫేస్ రెగ్యులర్‌గా వాడితే ఆ డేటా ఉండాలి కదా. ఆ డేటా ఏది. ఎందుకు డిలీట్ చేశారు. ఆ డేటాలో ఏం ఉంది. ఇదే పాయింట్‌తో కవితను కస్టడీకి తీసుకున్నారు అధికారులు. 292 కోట్ల వ్యవహారంలో కవిత పాత్ర ఎంత ఉంది అనే విషయంలో కూపీ లాగుతున్నారు.