వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం తుపానుగా బలపడింది. ఇవాళ బంగ్లాదేశ్ తీరంలో తీరం దాటింది అని ఐఎండీ (IMD) ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా దీంతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు తుఫాన్ (Cyclone) ముప్పు తప్పింది. తుఫాన్ ముప్పు తప్పింది కానీ.. రాష్ట్రంలో అక్కడక్కడ పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి : HARISH RAO: కాంగ్రెస్ పార్టీది 420 మేనిఫెస్టో: మంత్రి హరీశ్ రావు
ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి..
నేడు శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, పార్వతీపురం మన్యం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఏపీకి వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఏపీ తీర ప్రాంత వాసులతో పాటు మత్స్యకారులకు అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. ఈ రెండు మూడు రోజులు ఎవరు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (AP Meteorological Department) హెచ్చరించింది. ఏపీ వర్ష ప్రభావం తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపించదు అని తెలంగాణలో పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా ఉదయం సమయంలో పొగ మంచు వాతావరణం ఉంటుందని పేర్కొంది.
ఇది కూడా చదవండి : Rahul Gandhi: ప్రగతి భవన్‌ను ప్రజా పాలన భవన్‌గా మారుస్తాం: రాహుల్ గాంధీ
మరో వైపు దక్షిణ అండమాన్ వద్ద సముద్రంలో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీతోపాటు ఒడిశాలో పలు ప్రాంతాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. మరోవైపు బంగ్లాదేశ్ లో ఇవాళ రాత్రికి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడింది.