తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా మూడేళ్లు పూర్తయ్యింది. కాంగ్రెస్ పార్టీ అంటనే సీనియర్ పొలిటికల్ లీడర్స్‌కు కేరాఫ్ అడ్రస్. అలాంటి పార్టీలో ఎంతో మంది సీనియర్లను కాదని రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎంతో మంది సీనియర్లు వ్యతిరేకించిచా.. పార్టీ మారేందుకు రెడీ ఐనా రేవంత్‌ను మాత్రం ఆ కుర్చీ నుంచి దించలేదు. పార్టీ హైకమాండ్ తనమీద ఎంత నమ్మకం పెట్టుకుందో అంతే లాయాలిటీని ప్రూవ్ చేసి చూపించారు రేవంత్ రెడ్డి. ప్రాంతీయంగా పాతుకుపోయిన బీఆర్ఎస్, దేశంలో అధికారంలో ఉన్న బీజేపీని కూడా క్రాస్ చేసి తెలంగాణలో అధికారం సాధించి చూపించారు.
ఈ దెబ్బతో ఢిల్లీ దృష్టిలో రేవంత్ ఎక్కడికో వెళ్లిపోయారు. అందుకే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రేవంత్‌నే సీఎంని చేశారు. తాను టీపీసీసీ అధ్యక్ష పదవి చేపట్టి మూడేళ్లు పూర్తైన సందర్భంగా ట్విటర్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు సీఎం రేవంత్. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించి మూడు వసంతాలు పూర్తయ్యాయి. నాడు నాపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన సోనియాగాంధీకి, కాంగ్రెస్ అగ్రనేతలందరికీ కృతజ్ఞతలు.
పీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించడం, శ్రీమతి సోనియా గాంధీ సారథ్యంలో విజయ భేరీ సభ నిర్వహించడం, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం మూడేళ్లలో ఈ మూడు ఘట్టాలు నా జీవితంలో మరువలేని సందర్భాలు. ఈ ప్రస్థానంలో నాకు సహకరించిన పార్టీ సీనియర్ నేతలకు.. పార్టీ అధికారంలోకి రావడానికి కఠోర శ్రమ చేసిన లక్షలాది మంది కార్యకర్తలకు.. కాంగ్రెస్‌ను గెలిపించి ప్రజా పాలనకు నాంది పలికిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలంటూ పోస్ట్ చేశారు.