Khammam, Politics : ఖమ్మం పాలిటిక్స్ లో తుమ్మల హవా..

ఉమ్మడి ఖమ్మం రాజకీయాలను శాసించే స్థాయిలో ఎదిగిన తుమ్మల నాగేశ్వరరావు.. కాంగ్రెస్ గవర్నమెంట్ లో మంత్రి పదవి సంపాదించారు. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ సర్కారుల్లోనూ మంత్రిగా పనిచేసిన ఆయన.. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేబినెట్ లోనూ బెర్త్ సంపాదించారు. ఖమ్మం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన తుమ్మల నాగేశ్వరరావు.. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను ఓడించారు.

ఉమ్మడి ఖమ్మం రాజకీయాలను శాసించే స్థాయిలో ఎదిగిన తుమ్మల నాగేశ్వరరావు.. కాంగ్రెస్ గవర్నమెంట్ లో మంత్రి పదవి సంపాదించారు. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ సర్కారుల్లోనూ మంత్రిగా పనిచేసిన ఆయన.. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేబినెట్ లోనూ బెర్త్ సంపాదించారు. ఖమ్మం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన తుమ్మల నాగేశ్వరరావు.. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను ఓడించారు.

దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామంలో 1953 నవంబర్ 15న జన్మించిన తుమ్మల నాగేశ్వరరావు తన రాజకీయాలను అక్కడి నుంచే ప్రారంభించారు. 1982లో టీడీపీ అధ్యక్షుడు ఎన్టీఆర్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. టీడీపీ స్థాపించిన మొదటి ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఏడాదిన్నర తర్వాత 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పుడే తుమ్మలకు.. ఎన్టీఆర్ కేబినెట్ ర్యాంకు ఇచ్చారు. తుమ్మల 1985, 1994, 1999, 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి 2016లో టీఆర్ఎస్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2015లో శాసన మండలికి ఎలక్ట్ అయ్యారు.

REVANTH REDDY: ఆరుగ్యారెంటీలపై సీఎం రేవంత్ తొలి సంతకం.. పాలకులం కాదు.. సేవకులమన్న సీఎం

2009 ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు తుమ్మల.. 2014లో ఓడిపోవడంతో.. తర్వాత టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన కేసీఆర్.. ఆర్‌ అండ్‌ బీ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రిగా భాద్యతలు అప్పగించారు. 2016లో పాలేరు ఉపఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థిపై భారీ మెజారిటీతో గెలిచారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచే టీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు తుమ్మల.

2018 తర్వాత బీఆర్ఎస్ తనను గుర్తించకపోవడంతో… 2023 సెప్టెంబర్ 14న బీఆర్ఎస్ కి రాజీనామా చేశారు తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌ తాజ్‌ కృష్ణాలో జరిగిన CWC మీట్ లో పాల్గొనడానికి వచ్చిన AICC అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తుమ్మల నాగేశ్వరరావుకు ఖమ్మం టిక్కెట్ ఇచ్చింది. మాజీ మంత్రి పువ్వాడసై గెలిచిన తుమ్మల… ఇప్పుడు రేవంత్ రెడ్డి కేబినెట్ లో మినిస్టర్ గా ప్రమాణం చేశారు. ఆయన గతంలో చిన్న నీటిపారుదల, ఎక్సైజ్, భారీ నీటిపారుదల, R&B మంత్రిగా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ముగ్గురు సీఎంల హయాంలో పనిచేశారు. ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తుమ్మలకు… రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలోనూ చోటు దక్కింది.