హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అంబర్పేట, పెద్దఅంబర్పేట్, కాచిగూడ, నల్లకుంట, మల్కాజిగిరి, ఉప్పల్, LBనగర్, వనస్థలిపురం, కుషాయిగూడ, మేడ్చల్, హయత్నగర్, నాచారం, మల్లాపూర్, తార్నాక, లాలాపేట్, ఓయూ క్యాంపస్ తదితర ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. వాన కారణంగా చాలా చోట్ల రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో ట్రాఫిక్ జాం ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల ఈదురుగాలులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఈ జిల్లాల్లో కాసేపట్లో వర్షం..
కాసేపట్లో పలు జిల్లాల్లో వర్షం కురవనున్నట్టు HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో పిడుగులతో కూడిన వానలు పడతాయని చెప్పింది. అలాగే గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం కూడా ఉందని వెల్లడించింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది
తెలంగాణలోని ఈ జిల్లాలకు వర్ష సూచన…
మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణ పేట్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురవనుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. సుమారు గంటకు 40కి.మీ వేగంతో ఈదురుగాలులు కూడా వీచే ఛాన్స్ ఉందని వెల్లడించింది. కాగా ఇప్పటికే హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది.
ప్రాణం తీసిన గాలివాన..
హైదరాబాద్ శివారులో కురిసిన గాలివాన కాస్తా ఓ కుటుంబంలో విషాదం నింపింది. శామీర్పేటలో ఆదివారం ఈదురుగాలులు ఒకరి ప్రాణం తీశాయి. తిమ్మాయిపల్లి నుంచి శామీర్పేట వెళ్లేదారిలో గాలి దుమారానికి ఓ భారీ వృక్షం విరిగి బైకర్ మీద పడింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఈదురుగాలులతో పవర్ కట్..
హైదరాబాద్లో ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించాయి. దీంతో ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్నగర్, పెద్దఅంబర్పేట్. అబ్దుల్లాపూర్మెట్లో భారీ ఈదురుగాలులకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అంబర్పేట, కాచిగూడ, నల్లకుంట, ఉప్పల్, నాగోల్, మన్సూరాబాద్, మల్కాజిగిరి, తుర్కయంజాల్ ప్రాంతాల్లో ఈదురుగాలులతో పాటు వర్షం కురిసింది. ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.