BJP NO BC SLOGAN : బీసీలకు తగ్గుతున్న టిక్కెట్లు.. రెడ్డిలకే బీజేపీ ప్రాధాన్యత

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ స్లోగన్ తో ముందుకెళ్ళింది భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party). తాము అధికారంలోకి వస్తే బీసీ (BC) ని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించింది. కానీ అది వర్కవుట్ కాలేదు. బీసీ నినాదాన్ని తెలంగాణ ఓటర్లు (Telangana Voters) పెద్దగా పట్టించుకోలేదు. ఆ పార్టీకి 8 స్థానాలు మాత్రమే కట్టబెట్టారు. దాంతో పార్లమెంట్ ఎన్నికలకు (Parliament Elections) ఈ సారి ట్రాక్ మార్చేసింది కమలం పార్టీ.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ స్లోగన్ తో ముందుకెళ్ళింది భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party). తాము అధికారంలోకి వస్తే బీసీ (BC) ని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించింది. కానీ అది వర్కవుట్ కాలేదు. బీసీ నినాదాన్ని తెలంగాణ ఓటర్లు (Telangana Voters) పెద్దగా పట్టించుకోలేదు. ఆ పార్టీకి 8 స్థానాలు మాత్రమే కట్టబెట్టారు. దాంతో పార్లమెంట్ ఎన్నికలకు (Parliament Elections) ఈ సారి ట్రాక్ మార్చేసింది కమలం పార్టీ. అందుకే లోక్ సభ టిక్కెట్లను అగ్రవర్ణాల అభ్యర్థులకు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. బీజేఎల్పీ పోస్టు కూడా రెడ్డికి కేటాయించింది.

అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొన్ని నెలలే టైమ్ ఉందనగా… బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ (Bandi Sanjay) ను తొలగించింది. బీసీ అభ్యర్థిని తప్పించి రెడ్డికి పదవి ఇచ్చింది. ఈ ఇష్యూ కాంట్రోవర్సీ అయింది. బీజేపీ అధిష్టానానికి బాగా సెగ తగిలింది. బీసీని ఎందుకు తప్పించారని ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ నుంచి కూడా విమర్శలొచ్చాయి. దాంతో బీసీని ముఖ్యమంత్రిని చేసేందుకే… తనకు అవకాశం ఇచ్చారని కిషన్ రెడ్డి చెప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా కూడా … తమ ఎన్నికల ప్రచార సభల్లో బీసీ సీఎం స్లోగన్ వినిపించారు.

బీసీ సీఎం నినాదంతో జనంలోకి వెళ్ళినా… అసెంబ్లీ ఎన్నికల్లో ఆ వర్గం వాళ్ళు కమలం పార్టీని ఆదరించలేదు. మిగతా పార్టీల కంటే ఎక్కువ మంది బీసీలకే ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చింది బీజేపీ(BJP). ఆ పార్టీ గెలిచిన 8 సీట్లల్లో కూడా ముగ్గురు మాత్రమే బీసీలు ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా అగ్రవర్ణాల వాళ్ళే. దాంతో బీసీ స్లోగన్ వర్కవుట్ కాలేదని గ్రహించిన బీజేపీ హైకమాండ్… ఇప్పుడు ఓసీలకు ప్రాధాన్యత ఇస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో జిల్లా అధ్యక్షులను మార్చారు రాష్ట్రపార్టీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి(Kishan Reddy). వీళ్ళల్లో చాలామంది రెడ్డి వర్గానికి చెందిన వాళ్ళే ఉన్నారు. మహిళా మోర్చాతో పాటు… బీజేఎల్పీ నేతగా కూడా రెడ్డినే నియమించింది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గెలిచే వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తోంది బీజేపీ హైకమాండ్. అందులో భాగంగా అగ్రవర్ణాలకే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. బీసీ టిక్కెట్లకు భారీగా కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాదు… ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల్లో కలిపి మొత్తం 55 మందికి పైగా రెడ్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈ పరిస్థితుల్లో తాము బీసీలను పట్టుకుంటే లాభం లేదని భావిస్తోంది బీజేపీ.

పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో బీసీలకు ఐదు టిక్కెట్లు ఇవ్వాలనుకున్నారు. కానీ మారిన పరిస్థితుల్లో నలుగురు బీసీలకు మాత్రమే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రెండు మున్నూరు కాపులు, ఒకటి గౌడ, మరొకటి ముదిరాజ్ కు ఇచ్చే ఛాన్సుంది. అయితే జహీరాబాద్, నల్లగొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గాల్లో చాలా మంది బీసీ నేతలు టిక్కెట్లు కావాలని అడుగుతున్నారు. కానీ వాళ్ళెవరికీ అవకాశాలు దక్కవని అంటున్నారు