టీ ట్వంటీ ఫార్మాట్ లో భారత క్రికెటర్ తిలక్ వర్మ సూపర్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. ఇటీవల సఫారీ గడ్డపై వరుసగా రెండు సెంచరీలతో దుమ్మురేపిన ఈ హైదరాబాదీ ప్లేయర్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలోనూ పరుగుల వరద పారిస్తున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో తిలక్ ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. తాజాగా బీహార్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో హాఫ్ సెంచరీతో మెరిశాడు. మొత్తంగా నవంబర్ నెలలో తాను ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ తిలక్ వర్మ సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో బీహార్‌పై హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. బీహార్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. తర్వాత హైదరాబాద్ 12.3 ఓవర్లలోనే వికెట్ నష్టపోయి టార్గెట్ ను ఛేదించింది.