Telangana BJP : నేడు తెలంగాణలో అమిత్ షా పర్యటన.. లోక్ సభ ఎన్నికల దృశ్య సమావేశాలు..

భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) పార్లమెంట్ ఎన్నికలకు (Parliament Elections) సిద్ధం అవుతుంది. ఈ సందర్భంగానే తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (BJP) సన్నాహాలు మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనలు మొదలైనాయి.

 

 

 

భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) పార్లమెంట్ ఎన్నికలకు (Parliament Elections) సిద్ధం అవుతుంది. ఈ సందర్భంగానే తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (BJP) సన్నాహాలు మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనలు మొదలైనాయి.

నేడు తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)పర్యటన చేయబోతున్నారు. మంగళవారం మధ్యహ్నం 1:20 నిమిషాలకు అమిత్ షా బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు.
అక్కడి నుంచి సికింద్రాబాద్‌ సిఖ్‌ విలేజ్‌లోని ఇంపీరియల్‌ గార్డెన్స్‌లో నిర్వహిస్తున్న BJP పార్టీ సోషల్ మీడియా వ్యూహకర్తలతో సమావేశంకు.. బీజేపీ అగ్రనేత అమిత్ షా హాజరుకానున్నారు. పార్టీ పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశంలో కూడా ఆయన మాట్లాడనున్నారు. ‘విజయ్ సంకల్ప్ సమ్మేళన్’ పేరుతో ఈ సమావేశం ఎల్‌బీ స్టేడియం లో జరగనుంది. వచ్చే ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి ఆయన దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం పబ్లిక్‌ గార్డెన్స్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగే సమావేశానికి హాజరవుతారు. అనంతరం ఆయన తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. కాగా.. ఇటీవలే తెలంగాణలో పర్యటించిన ప్రధాని మరోసారి తెలంగాణ పర్యటనకు రానున్నట్టు సమాచారం. ఈ నెల 15, 16, 17 తేదీల్లో ఆయన రాష్ట్రంలో పర్యటిస్తారని సమాచారం.

తెలంగాణలో అమిత్ షా పర్యటన షెడ్యూల్..

  • మధ్యాహ్నం ఒంటి గంట ఇరువై నిమిషాలకు బేగంపేట విమానాశ్రయం చేరుకోనున్న షా
  • 1.45 నుంచి 2.45 వరకు ఇంపీరియల్ గార్డెన్స్ లో సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్ లో దిశా నిర్దేశం చేయనున్న అమిత్ షా
  • 3.15 నుంచి 4.25 వరకు LB స్టేడియంలో విజయ సంకల్ప సమ్మేళనంలో పాల్గొననున్న షా
  • 4.45 నుంచి 5.45 వరకు ITC కాకతీయలో ముఖ్య నేతలతో సమావేశం
  • 6.10 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి తిరుగు ప్రయాణం