Indiramma House Scheme : నేడు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం

కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) మరో పథకానికి శ్రీకారం చుట్టనుంది. ఎన్నికల హామీలో ఆరు గ్యారెంటీలల్లో (Six guarantees) అతి ముఖ్యమైన 6 గ్యారెంటీల స్కీమ్ ఇందిరమ్మ ఇళ్ల పథకం.. పేదలు సొంత స్థలంలో ఇళ్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఇవాళ ప్రారంభించనున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) మరో పథకానికి శ్రీకారం చుట్టనుంది. ఎన్నికల హామీలో ఆరు గ్యారెంటీలల్లో (Six guarantees) అతి ముఖ్యమైన 6 గ్యారెంటీల స్కీమ్ ఇందిరమ్మ ఇళ్ల పథకం.. పేదలు సొంత స్థలంలో ఇళ్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఇవాళ ప్రారంభించనున్నారు. నేడు భద్రాద్రి జిల్లాల్లో (Bhadradri District) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పర్యటించనున్నారు. భద్రాచలం (Bhadrachalam) చేరుకుని శ్రీ సీతారమచంద్ర స్వామివారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం భద్రాచలంలోని అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ గ్రౌండ్‌లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని (Indiramma House Scheme) ప్రారంభించనున్నారు. సుమారు 5 వేల మంది మహిళలు పాల్గొనేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భద్రాచలం ఆలయ అభివృద్ధి, నీటిపారుదలకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు మణుగూరులోని ప్రభుత్వ కళాశాలలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. దశల వారీగా అర్హులకు ఇళ్లు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకానికి రూ.3 వేల కోట్లు మంజూరు చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. తొలి విడతలో అర్హులకు 95,235 ఇళ్లు మంజూరు చేయనుంది. సభ ముగిసిన అనంతరం సాయంత్రం 6.10 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.