Hanuman Jayanti : నేడు హనుమాన్ జయంతి.. కాషాయమయంగా కొండగట్టు అంజన్న క్షేత్రం..

తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో అతి పెద్ద అంజన్న ప్రసిద్ధ ఆలయం కొండగట్టు ఆంజనేయస్వామి (Kondagattu Anjanna) ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు.

 

 

తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో అతి పెద్ద అంజన్న ప్రసిద్ధ ఆలయం కొండగట్టు ఆంజనేయస్వామి (Kondagattu Anjanna) ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. అందులోను నేడు అంజన్న జయంతి (Hanuman Jayanti) కావటంతో అర్ధరాత్రి నుంచే స్వామి వారిని దర్శించుకోడానికి భక్తులు పోటెత్తారు.

కొండగట్టు ఆంజనేయస్వామి క్షేత్రం రామనామ (Rama name) జపంతో మారుమోగుతోంది. దీక్షా విరమణ చేసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన మాలదారులతో ఆలయ పరిసరాలు కాషాయమయంగా మారిపోయాయి. ఈరోజు పెద్ద హనుమాన్ జయంతి (Hanuman Jayanti) నేపథ్యంలో మాలదారులు, భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. గురువారం ఈ ఉత్సవాలు ప్రారంభం అయినప్పటి నుంచి భక్తులు దీక్ష విరమణ కోసం భారీగా తరలివస్తున్నారు. సుమారు 2 లక్షల మంది దీక్ష విరమణ చేసినట్టు అధికారులు తెలిపారు. కాగా కొండగట్టు ఆలయంలో జగిత్యాల జిల్లా కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా ఉత్సవాలను పరిశీలించారు. ప్రజలు కొండపైకి చేరుకొనేలా నాలుగు ఆర్టీసీ బస్సులను సమకూర్చారు. అంజన్న దర్శనానికి వచ్చే భక్తులకు తాగునీరు, వైద్య సేవలు అందుబాటులో ఉంచామని.. ప్రసాదం విక్రయానికి 14 కౌంటర్లతో పాటు చలువ పందిళ్లను ఏర్పాటు చేశాం కోనేరులో నీళ్లను ఎప్పటికప్పుడూ మార్చుతున్నట్లు కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా వివరించారు. కాగా అంజన్న జయంతి ఉత్సవాలను జగిత్యాల జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్‌ సింగ్‌ 650 మంది పోలీసులతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజుతో కొండగట్టులో ఉత్సవాలు ముగియనున్నాయి.