నేడు బీహార్(Bihar CM) సీఎం నితీష్ కుమార్ (Nitish Kumar) సీఎంగా ప్రమాణ స్వీకారం. ఈరోజు 10.30 గంటలకు జేడీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశం అనంతరం గవర్నర్ ను కలిసిన నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించనున్నారు. తిరిగి సాయంత్రం బీహార్ 9వ సారి నితీష్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితీష్ కుమార్ ప్రస్తుతమున్న ఇండియా కూటమికి గుడ్ బై చెప్పి.. బీజేపీ (BJP Alliance) కూటమితో ఒప్పందం కుదుర్చుకున్నారు.
బీహార్ రాజకీయాలు క్షణం క్షణం మారిపోయాయి. బీహార్ రాజకీయాలు (Bihar Politics) ఎప్పుడు ఎలా మలుపులు తిరుగుతాయో ఎవరికి తెలియదు. శరవేగంగా మారిపోతాయి. తాజాగా బీజేపీ మద్దతుతో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాగా ఈ పార్టీ ఒప్పందంతో నితీష్ పెట్టిన షరతులను బీజేపీ స్వీకరించింది. దీంతో బీజేపీకి స్పీకర్ పదవితో పాటు ఇద్దరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ల పదవులు కూడా ఇచ్చింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు బీహార్ సీఎంగా నితీష్ కుమార్.. డిప్యూటీ సీఎం లుగా బీజేపీ నేతలు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ తర్వత బీహార్ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు.