New Governor, Jishnudev Verma : నేడు రాష్ట్రానికి కొత్త గవర్నర్.. సాయంత్రం తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ ప్రమాణస్వీకారం..

నేడు రాష్ట్రానికి తెలంగాణ గర్నవర్‌ (New Governor) గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మ (Jishnudev Verma) రానున్నారు. ఇవాళ సాయంత్రం తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

నేడు రాష్ట్రానికి తెలంగాణ గర్నవర్‌ (New Governor) గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మ (Jishnudev Verma) రానున్నారు. ఇవాళ సాయంత్రం తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. రాజ్‌భవన్‌లో సాయంత్రం 5.03 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ ఆరాధే (Justice Alok Aaradhe) నూతన గవర్నర్‌తో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. జిష్ణుదేవ్ (Jishnudev Verma) 2018 నుంచి 2023 వరకూ త్రిపుర (Tripura) డిప్యూటీ సీఎం (Deputy CM) గా పని చేశారు. కాగా ఇప్పటి వరకు రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ మహారాష్ట్రకు బదిలీ అయిన విషయం తెలిసిందే. త్రిపురకు చెందిన… రెండు రోజుల క్రితమే జిష్ణుదేవ్‌ను గవర్నర్‌గా నియమించారు. ఆయనతో పాటూ మరో తొమ్మిది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్లను నియమించింది. అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేయడం కొంత ఆలస్యమయింది. ఈరోజు సాయంత్రం హైకోర్టు చీఫ్ జస్టిస్ రాజ్ భవన్ లో ఆయన చేత గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

గతంలో బాడ్మింటన్ అసోషియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా సేవలందించారు. త్రిపుర రాజ కుటుంబానికి చెందిన జిష్ణుదేవ్ వర్మ రామ జన్మభూమి ఉద్యమ సమయంలో 1990లో బీజేపీ (Bjp) లో చేరారు. అప్పటి నుంచి ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. త్రిపుర ప్రభుత్వంలో ఆయన మంత్రిగా విద్యుత్తు, గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్, ఆర్ధిక, ప్రణాళిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖల బాధ్యతలను నిర్వర్తించారు. కాగా ప్రస్తుతం తెలంగాణతో పాటు జార్ఖండ్ గవర్నర్ (Jharkhand Governor) ​గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) మహారాష్ట్ర (Maharashtra) గవర్నర్​గా నియమితులయ్యారు.

Suresh SSM