Weather Update : నేటి వెదర్ అప్డేట్.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు అప్రమత్తం

ఏపీకి వాతావ‌ర‌ణ శాఖ చ‌ల్ల‌టి క‌బురు అందించింది. ఏపీలో నేటి నుంచి 3 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అల‌ర్ట్ జారీ చేసింది.

ఏపీకి వాతావ‌ర‌ణ శాఖ చ‌ల్ల‌టి క‌బురు అందించింది. ఏపీలో నేటి నుంచి 3 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అల‌ర్ట్ జారీ చేసింది. ప్రస్తుత రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్న‌ట్లు ఐఎండీ పేర్కొంది. అనకాపల్లి, శ్రీకాకుళం, కాకినాడ, కోనసీమ, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది. అటు తెలంగాణలో రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ అధికారులు తెలిపారు.

ఇవాళ రాష్ట్రంలో.. నిజామాబాద్,

నేడు నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్‌, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, హన్మకొండ, వరంగల్‌, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలతో పాటుగా గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని వెల్లడించారు. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ నెల 27, 28 తేదీల్లో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, ములుగు, వరంగల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, హన్మకొండ, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, పెద్దపల్లి, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిర్మల్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.