తిండి, తాగే నీళ్లు.. అన్నీ కలుషితం అయిపోతున్నాయ్ ఈ మధ్య. పండ్లపై కూడా కెమికల్స్ చల్లి.. తొందరగా పక్వానికి వచ్చేలా చేసి అమ్మేస్తున్నారు. ఐతే ఫ్రూట్‌జ్యూస్‌ను కల్తీ చేస్తూ ఓ ముఠా పట్టుబడింది. వాడు ఎంత నీచుడు అంటే.. ఫ్రూట్ జ్యూస్‌లో మనుషుల మూత్రం పోసి అమ్ముతున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్రూట్ జ్యూస్‌లో మూత్రాన్ని కలిపి అమ్ముతున్న ఈ దారుణమైన ఘటన.. ఉత్తర్‌ప్రదేశ్‌లో సంచలనం రేపుతోంది. ఘాజియాబాద్ పట్టణంలో అమీర్ ఖాన్ అనే వ్యక్తి… ఖుషీ జ్యూస్ కార్నర్ అనే పేరుతో ఫ్రూట్ జ్యూస్ అమ్ముతున్నాడు. అక్కడ తయారు చేసే జ్యూస్‌లో మూత్రం కలిపి.. కస్టమర్లకు విక్రయిస్తున్నాడు. అయితే ఆ జ్యూస్ తాగిన కొందరు కస్టమర్లకు అందులో ఏదో కలిపారు అనే అనుమానం నచ్చింది. దీంతో అక్కడ తనిఖీలు చేయగా.. మూత్రం డబ్బా కనిపించింది. దీంతో అనుమానం వచ్చి అమీర్ ఖాన్‌ను గట్టిగా అడగ్గా.. అసలు విషయం బయటపడింది. అమీర్ ఖాన్ అతడి సహాయకుడిపై స్థానికులు దాడి చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత ఇద్దర్నీ అరెస్ట్ చేశారు. అయితే మూత్రం పోయడానికి షాప్‌లో బాత్రూం లేదని.. పరిసరాల్లో కూడా ఎలాంటి ఖాళీ ప్రదేశం లేదని పోలీసుల విచారణలో నిందితులు చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే మూత్రాన్ని అలా డబ్బాలో పోసినట్లు వివరించారని తెలుస్తోంది. అయితే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను డిమాండ్ చేశారు.ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఛీ చీ ఇంతకు తెగిస్తార్రా అంటూ.. నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.