టమాట లేనిదే ఏ కూర కనిపించేది కాదు నిన్నటివరకు. అలాంటిది ఇప్పుడన్నీ టమాటలెస్ అయిపోయాయ్. టమాట లేక.. కూర రుచి రాక.. గొంతులోకి ముద్ద దిగక.. ఆహార ప్రియులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు పాపం. పోనీ ధైర్యం చేసి కొందామంటే.. మధ్యతరగతి కుటుంబ బడ్జెట్ కుదేలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయ్. దీంతో జనాలు రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. టమాట ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురుచూస్తున్నారు.
కొన్ని చోట్ల అయితే ప్రభుత్వాలే చొరవ తీసుకొని.. టమాట రేట్లకు సబ్సిడీ అందిస్తున్నాయ్. అయినా సరే వంద మీదే కిలో టమాట ధర కనిపిస్తోంది. ఈ కష్టాన్నింటిని కలిపి.. సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయ్. మీమర్లు చేస్తున్న పోస్టులు.. పొట్ట చెక్కలయ్యేలా చేస్తున్నాయ్. నగలు కొని ఎలా టమాటలతో ట్రాన్సాక్షన్ చేసే ఇమేజ్‌లు.. పెట్రోల్, డీజిల్ కంటే టమాటా ధరలు దూసుకుపోతున్నాయని అర్థం వచ్చేలా క్రియేట్ చేసిన పోస్టులు.. మనీ హీస్ట్‌లాగా టమాటా హీస్ట్ చేసి హ్యాపీ అయ్యే దొంగల మీమ్స్.. ఇలా సోషల్ మీడియాలో పేలుతున్న మీమ్స్ అన్నీ ఇన్నీ కావు. టమాటా ధరలను మిగతా నిత్యావసరాల వస్తువులతో పోలుస్తూ క్రియేట్ చేసిన మీమ్స్ అయితే.. మరింత నవ్వు తెప్పిస్తున్నాయ్.