Guvwala Balaraju : గువ్వల బాలరాజుపై ఎందుకు దాడి చేశారో చెప్పిన మల్లు రవి..

ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Guvwala Balaraju) పై జరిగిన దాడి ఒక్కసారిగా అచ్చంపేట రాజకీయం హీటెక్కింది. నిన్న ప్రచారం ముగించుకుని ఇంటికి వెళ్తున్న గువ్వల బాలరాజు వర్గానికి.. కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీకృష్ణ అభ్యర్థులకు మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మార్గ మధ్యలో మాటా మాటా పెరగడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో అటు బీఆర్‌ఎస్‌ ఇటు కాంగ్రెస్‌ ఇరు వర్గాల కార్యకర్తలకు గాయాలయ్యాయి. గువ్వల బాలరాజు కూడా తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆయనను హాస్పిటల్‌కు తరలించారు.

ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Guvwala Balaraju) పై జరిగిన దాడి ఒక్కసారిగా అచ్చంపేట రాజకీయం హీటెక్కింది. నిన్న ప్రచారం ముగించుకుని ఇంటికి వెళ్తున్న గువ్వల బాలరాజు వర్గానికి.. కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీకృష్ణ అభ్యర్థులకు మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మార్గ మధ్యలో మాటా మాటా పెరగడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో అటు బీఆర్‌ఎస్‌ ఇటు కాంగ్రెస్‌ ఇరు వర్గాల కార్యకర్తలకు గాయాలయ్యాయి. గువ్వల బాలరాజు కూడా తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆయనను హాస్పిటల్‌కు తరలించారు. మెరుగైన చికిత్సకోసం వెంటనే హైదరాబాద్‌కు తరలించారు. బాలరాజును పరామర్శించేందుకు మంత్రి కేటీఆర్‌ హాస్పిటల్‌కు వచ్చారు. అయితే గువ్వల బాలరాజుపై దాడి గురించి టీపీసీసీ ఉపాధ్యక్షుడు (TPCC Vice President) మల్లు రవి ( Mallu Ravi) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. బాలరాజు ఓ అసాంఘిక శక్తిగా మారాడంటూ రవి ఆరోపించారు. నిన్న రాత్రి తన కారులో డబ్బు పంచేందుకు బ్లాక్‌ మనీతో వెళ్తున్న బాలరాజును కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారంటూ రవి చెప్పారు. విషయం బయటపడుతుందనే భయంతో బాలరాజు తన అనుచరులతో కాంగ్రెస్‌ కార్యకర్తలమీద దాడి చేయించారంటూ చెప్పారు. ఈ దాడిలో అసలు ఆయన గాయపడలేదని.. సింపతీ కోసం హాస్పిటల్‌లో చేరి నాటకాలు ఆడుతున్నారంటూ చెప్పారు. ఓడిపోతామన్న భయంతో బీఆర్‌ఎస్‌ నేతలు ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారంటూ ఆరోపించారు రవి. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణలో కాంగ్రెష్‌ జెండా ఎగరేసి తీరుతామంటూ చెప్పారు. మరి మల్లు రవి చేసిన ఆరోపణలపై బీఆర్‌ఎస్‌ నేతలు ఎలా కౌంటర్‌ ఇస్తారో చూడాలి.