Traffic Diversions: రంజాన్ పండుగ సందర్భంగా గురువారం హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. నగరంలోని అనేక ప్రాంతాల్లో ముస్లింలు ప్రార్థనలు చేస్తారు కాబట్టి.. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని కోరారు. నెల రోజుల పాటు రంజాన్ ఉపవాస దీక్ష కొనసాగించిన ముస్లింలు గురువారం, ఉపవాసం విరమించి రంజాన్ పండుగ జరుపుకొంటారు.
JANASENA CAMPAIGN: స్టార్ వ్యూహం.. హైపర్ ఆది, గెటప్ శ్రీనుకు పవన్ కీలక బాధ్యతలు
ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. హైదరాబాద్ నగరంలోని కీలక మసీదులు, దర్గాలలో ఈ ప్రార్థనల్లో పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొంటారు. దీంతో ఎవరికీ, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. ముందు జాగ్రత్తగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మార్గాల్లోనే ట్రాఫిక్ ఆంక్షలుంటాయి. మాసబ్ ట్యాంక్ జంక్షన్ ఫ్లైఓవర్ కింద కింద వాహనాల రాకపోకలను అనుమతించరు. గురువారం ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు మెహదీపట్నం, లక్డీకాపూల్ వైపు నుంచి ఫ్లై ఓవర్ పై మాత్రమే వాహనాలకు అనుమతి ఉంటుంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 నుంచి మాసబ్ ట్యాంక్ వైపు వచ్చే వాహనాలు రోడ్ నెంబర్ 12 జంక్షన్ నుంచి తాజ్ కృష్ణ హోటల్, ఆర్టీఏ ఖైరతాబాద్ వైపు వెళ్లాలి. పంజాగుట్ట నుంచి తాజ్ కృష్ణ హోటల్.. ఎర్రం మంజిల్ కాలనీ, ఆర్టీఏ ఖైరతాబాద్, నిరంకారి భవన్, లక్డీకపూల్, మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్, మెహాదీపట్నం వైపు వాహనాలను మళ్లిస్తారు.
మీర్ ఆలం ఈద్గా, మాసబ్ ట్యాంక్ పరిధిలోని హాకీ గ్రౌండ్స్‌లో ఈదుల్ పితర్ ప్రార్థన ఉన్న నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల వరకు ఎలాంటి వాహనాలను అనుమతించరు. ప్రత్యామ్నాయంగా బహదూర్ పూర చౌరస్తా వద్ద కిషన్ బాగ్, కామాటి పురా, పురానా పూల్ వైపు వెళ్లవచ్చు. రాజేంద్ర నగర్ నుంచి బహదూర్ పురా వైపు వెళ్లే భారీ వాహనాలను ఆరంఘర్ జంక్షన్ వద్ద లేదా శంషాబాద్, రాజేంద్రనగర్, మైలర్‌దేవ్ పల్లి వైపు, పురానా పూల్ నుంచి బహదూర్ పురా వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలను జియగూడ వైపు మళ్లిస్తారు. కాలపత్తార్ వద్ద మోచీ కాలనీ, బహదూర్ పురా, శంషీర్ గంజ్, నవాబ్ సాహెబ్ కుంట వైపు వాహనాలను మళ్లిస్తారు. ఈద్గా వైపు వెళ్లే వాహనాలను శాస్త్రిపురం, ఎన్ ఎస్ కుంట తదితర ప్రాంతాల వైపు మళ్లిస్తారు.