Bihar : బీహార్ లో ఘోర విషాదం.. ఛత్ ఘాట్ వద్ద నీటి మునిగి 22 మంది మృతి..

బీహార్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బీహార్ లోని పలు ఛత్ ఘాట్ ల వద్ద నీట మునిగి దాదాపు 22 మంది మృతి చెందారు.

బీహార్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బీహార్ లోని పలు ఛత్ ఘాట్ ల వద్ద నీట మునిగి దాదాపు 22 మంది మృతి చెందారు. ఆది, సోమవారాల్లో ఈ దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయి. కాగా ఈ ఘటనలో ఆరుగురు యువకులు, నలుగురు చిన్నారులు, ఏడుగురు యువతులు, ఒక బాలికతో సహా ఐదుగురు మహిళలు ఉన్నారు. షాపూర్ సమీపంలో బ్రహ్మాపూర్ చెరువులో అర్ఘ్యం ఇస్తున్న సమయంలో ఇద్దరు కవల సోదారులు.. ముగ్గురు యువకులు నీట మునిగి మృతి చెందారు.

MP Vivek’ : మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో ఐటీ రైడ్స్..

ఈ ఘటన జరిగిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. జనం ఆగ్రహంతో జగన్ పుర సమీపంలోని కొత్త బైపాస్ రోడ్డును దిగ్భంధించి, ట్రాఫిక్ చెక్ పోస్టులను ధ్వంసం చేశారు. ఇక మరో జిల్లా అయిన సరన్ జిల్లాలోని దిఘ్వారా పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌దాస్చక్ గ్రామంలో గంగా నదిలో స్నానం చేస్తుండగా.. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బాలికలు, ఒక బాలుడు నీటిలో మునిగి మరణించారు. ఇక మరో జిల్లా.. దర్భంగా లోని నెహ్రా అసిస్టెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగదీష్‌పూర్ గ్రామంలో కొందరు యువకులు ఛత్‌ పూజ అనంతరం జూదం ఆడుతున్నారు. పబ్లిక్ ప్లేస్ లో జూదం ఆడుతున్నట్లు సమాచారం అందుకుని అక్కడికి పోలీసులు చేరుకోగా.. వారంతా అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ క్రమంలో పోలీసులకు బయపటి పరిపోతుండగా.. నీటితో నిండిన గోతిలో రోషన్ అనే యువకుడు పడిపోయి మృతి చెందాడు.