Nederland: మిస్ యూనివర్స్ పోటీల్లో ట్రాన్స్ జండర్ చారిత్రాత్మక విజయం..!

ప్రపంచం మారిపోయింది. ఒకప్పుడు ఉన్న కాలానికి ప్రస్తుతం ఉన్న కాలానికీ పొంతన లేనంతగా మారిపోయింది. అబ్బాయిలు ఫ్యాషన్ షో పోటీల్లో పాల్గొనడం చూశాం. అమ్మాయిలు విశ్వసుందరిగా నెగ్గడం చూశాం. కానీ ఇక్కడ ఇరువురి కలయికతో కూడిన అర్థనారీశ్వరుడికి అంటే ఒక ట్రాన్స్ జండర్ అందాల పోటీల్లో పాల్గొన్నారు. అందాల కిరీటాన్ని తన సొంతం చేసుకున్నారు. ఇది చరిత్రలోనే మొట్టమొదటి సారిగా చెప్పాలి. ఈ పోటీలు ఎక్కడ జరిగాయో ఈ టైటిల్ గెలుచుకున్న ట్రాన్స్ జెండర్ పేరు తదితర పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

  • Written By:
  • Publish Date - July 12, 2023 / 01:25 PM IST

ఒకప్పుడు హిజ్రాలు అంటే చులకనగా, హేళనగా చూసేవారు. వారికి సమజంలో తగిన గౌరవం, గుర్తింపు ఉండేది కాదు. కానీ 21వ దశాబ్ధం ఇలాంటి వాటిని పాతాళంలోకి నెట్టి.. సమాజానికి వెనుకబడిన వారిని ఆకాశం అంచున నిలబెట్టింది. దీనికి నిలువెత్తు నిదర్శనం ఈ మిస్ యూనివర్స్ పోటీల్లో సాధించిన విజయం. ఒకప్పుడు ట్రాన్స్ జెండర్స్ అంటే రోడ్లపై అరచేతులతో శబ్ధాలు చేసుకుంటూ బిక్షాటన చేసుకుని బ్రతికేవాళ్లలాగా చూశారు. కొంత కాలానికి డాక్టర్లుగా, బ్యూటీషియన్స్ గా, హెయిర్ స్టైల్ డిజైన్లు, ఫ్యాషన్ డిజైనర్స్, బిజినెస్ మ్యాగ్నెట్స్ గా, ఇప్పుడు మోడల్స్ గా మారారు. కాలనికి తగ్గట్టుగా తమ కళాను ప్రదర్శించి స్వశక్తితో జీవనం సాగిస్తున్నారు. వీరి ద్వారా ఎంతో మందికి ప్రేరణనిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక తాజాగా మిస్ యూనివర్స్ గా మారిన ఈ ట్రాన్స్ జెండర్ గురించి తెలుసుకుందాం.

నెదర్లాండ్స్ లోని ఆమ్ స్టర్ డామ్ లో జరిగిన 72వ మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్నారు. ఈమె పూర్తిపేరు మొలుకన్ మోడల్ రిక్కీ వాలెరీ కొల్లె. ఈ వేడుకలో ఈమెతో పాటూ హబీబా మోస్టాఫా, లౌ డిర్చ్ ఫా, నథాలీ మోగ్ బెల్జాదా తో పాటూ పలువురు అందగత్తెలు పోటీ పడ్డారు. అయినప్పటికీ తనదైన దేహ.. భావ సౌందర్యాన్ని చూసిస్తూ ర్యాప్ వాక్ చేశారు. పోటీలో పాల్గొన్న తన తోటి మోడల్స్ ని వెనక్కి నెట్టి మిస్ నెదర్లాండ్స్ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఇది చరిత్రలో ఎక్కడా కనీ వినీ ఎరుగని విజయం. ఈ చారిత్రాత్మక విజయంపై పలువురు పోటీదారులతో పాటూ మిస్ రిక్కీ కూడా మాట్లాడారు.

‘ఈ విజయం కోసం పరివిధాలుగా తపన పడ్డాను. నేను గెలుస్తానని భావించిన మిస్ నెదర్లాండ్స్ జట్టులోని ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. నేను నాలాగా ఉన్న వాళ్లందరికీ ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను. సమాజంలో మా పట్ల ఉన్న వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు అవసరమైన శక్తిని ఈవేదిక ద్వారా పొందుతున్నాను. నిబద్ధత, బలం ఈ రెండింటినీ ఆయుధంగా మాలిచి మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నాను. తమలాంటి వారికి సమాజంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చేయడమే నా ప్రదాన ధ్యేయం అని తెలిపారు. దీనికోసం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు పేర్కొన్నారు. చివరగా మిస్ నెదర్లాండ్స్ సంస్థ తన వెనుక వెన్నంటే ఉండి టైటిల్ గెలిచే వరకూ ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు’ తెలుపుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

T.V.SRIKAR