వీడెక్కడి తలనొప్పిరా అయ్యా, భారత్ కు కొరకరాని కొయ్య

ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రావిస్ హెడ్ టీమిండియాకు తలనొప్పిలా తయారయ్యాడు. పెద్ద టోర్నీల్లో ఇప్పటికే పలుసార్లు భారత్ కు కొరకరాని కొయ్యలా మారిన హెడ్ తాజాగా సొంతగడ్డపైనా దుమ్మురేపుతున్నాడు. భారత్ అంటేనే చెలరేగిపోయే ఈ ఆసీస్ హిట్టర్ గబ్బా వేదికగా జరగుతున్న మూడు టెస్టులోనూ సెంచరీతో కదం తొక్కాడు.

  • Written By:
  • Publish Date - December 16, 2024 / 02:50 PM IST

ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రావిస్ హెడ్ టీమిండియాకు తలనొప్పిలా తయారయ్యాడు. పెద్ద టోర్నీల్లో ఇప్పటికే పలుసార్లు భారత్ కు కొరకరాని కొయ్యలా మారిన హెడ్ తాజాగా సొంతగడ్డపైనా దుమ్మురేపుతున్నాడు. భారత్ అంటేనే చెలరేగిపోయే ఈ ఆసీస్ హిట్టర్
గబ్బా వేదికగా జరగుతున్న మూడు టెస్టులోనూ సెంచరీతో కదం తొక్కాడు. టెస్టుల్లో ఓవరాల్‌గా తొమ్మిది శతకాన్ని అందుకున్న హెడ్.. టీమిండియాపైనే మూడు సెంచరీలు సాధించాడు. లబూషేన్ ను నితీశ్ రెడ్డి ఔట్ చేశాడన్న ఆనందం కొద్దిసేపు కూడా నిలవలేదు. హెడ్‌ రాకతో సీన్‌ రివర్స్‌ అయింది. స్టీవ్‌ స్మిత్‌తో కలిసిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. టీమిండియా బౌలర్లకు తలనొప్పిగా మారాడు.క్రీజులో పాతుకుపోయిన హెడ్‌.. ధనాధన్‌ బ్యాటింగ్‌తో 115 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గబ్బాలో సెంచరీ బాదిన ట్రావిస్ హెడ్ అరుదైన ఘనత సాధించాడు. ఓ క్యాలెండర్ ఇయర్‌లో ఓ వేదికపై కింగ్ పెయిర్ – శతకం సాధించిన ప్లేయర్‌గా ట్రావిస్ హెడ్ రికార్డు నెలకొల్పాడు.

ఓ టెస్టులో ఓ ఆటగాడు రెండు ఇన్నింగ్స్‌లో తొలి బంతికే డకౌటవ్వడాన్ని కింగ్ పెయిర్ అంటారు. గబ్బా వేదికగా అంతకుముందు వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో డకౌటయ్యాడు. వెస్టిండీస్ కంటే ముందు జరిగిన మ్యాచ్‌లోనూ హెడ్ గోల్డెన్ డకౌటయ్యాడు. గబ్బాలోని గత మూడు ఇన్నింగ్స్‌ల్లో గోల్డెన్ డకౌటైన ట్రావిస్ హెడ్ టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో శతకంతో చెలరేగాడు. అలాగే ఓ క్యాలెండ్ ఇయర్‌లో ఓ వేదికపై పెయిర్ , సెంచరీ సాధించిన ఆరో బ్యాటర్‌గా నిలిచాడు. హెడ్ కంటే ముందు 1958లో వాజిర్ మహ్మద్ , 1974లో అల్విన్ కల్లిచరణ్ , 2001లో మార్వన్ ఆటపట్టు, 2004లో రామ్‌నరేశ్ శర్వాన్ 2004లో మహ్మద్ అష్రాఫుల్ ఈ ఘనత సాధించారు.

కాగా భారత్ పై మరోసారి హెడ్ తన డామినేషన్ ను చూపించాడు. గతంలో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ లోనూ భారత్ విజయానికి అడ్డుగోడగా నిలిచిన ఈ హిట్టర్ ఇప్పుడు గబ్బాలోనూ ఆసీస్ భారీస్కోరులో కీలకమయ్యాడు. అడిలైడ్ పింక్ టెస్టులోనూ హెడ్ సెంచరీ కారణంగానే మ్యాచ్ మలుపు తిరిగింది. మిగిలిన బ్యాటర్లను కట్టడి చేసిన మన బౌలర్లు అతన్ని మాత్రం అడ్డుకోలేకపోవడంతో రెండో టెస్టులో ఆసీస్ కు భారీ ఆధిక్యం దక్కింది. ఇప్పుడు గబ్బాలోనూ సెంచరీతో చెలరేగిన హెడ్ తన జట్టుకు భారీస్కోరు అందించాడు.