మళ్ళీ హెడేక్ తప్పదా ? బాక్సింగ్ డే టెస్ట్ ఆడతానన్న హెడ్

ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ ట్రావిస్ హెడ్ టీమిండియాకు సెంచరీలతో హెడేక్ తెప్పిస్తున్నాడు. తాజాగా గబ్బా వేదికగా తన బ్యాట్ పవర్ ఏంటో మరోమారు చూపించాడు. తాజాగా జరిగిన టెస్ట్‌ మ్యాచ్ లో రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. హెడ్ విధ్వంసానికి మ్యాచ్‌ కంగారూల వైపు మళ్లింది.

  • Written By:
  • Publish Date - December 20, 2024 / 02:45 PM IST

ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ ట్రావిస్ హెడ్ టీమిండియాకు సెంచరీలతో హెడేక్ తెప్పిస్తున్నాడు. తాజాగా గబ్బా వేదికగా తన బ్యాట్ పవర్ ఏంటో మరోమారు చూపించాడు. తాజాగా జరిగిన టెస్ట్‌ మ్యాచ్ లో రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. హెడ్ విధ్వంసానికి మ్యాచ్‌ కంగారూల వైపు మళ్లింది. అయితే వరుణుడు కరుణించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో ఇరు జట్లు తలో మ్యాచ్ గెలిచి సమంగా నిలిచాయి. అయితే డిసెంబర్ 26 నుంచి ఇరు జట్ల మధ్య మెల్‌బోర్న్‌ వేదికగా నాలుగో మ్యాచ్ జరగనుంది. ఈ బాక్సింగ్ డే టెస్టుకు హెడ్ దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది. గత మ్యాచ్ లో హెడ్ గాయపడ్డాడు. దీంతో హెడ్ బాధ తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ హెడ్ ఫిట్నెస్ పై వచ్చిన సమాచారం తెలుసుకుని ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది.

మూడో టెస్టులో 152 పరుగుల వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్న ట్రావిస్ హెడ్ బాక్సింగ్ డే టెస్ట్ ఆడతానని స్పష్టం చేశాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో అతను క్రీజులో నొప్పితో బాధపడుతూ కనిపించాడు. కానీ తన బ్యాటింగ్‌ పట్ల చాలా సంతోషంగా ఉన్నానని చెప్పాడు. వచ్చే మ్యాచ్ నాటికి అంతా సర్దుకుపోతుందని క్లారిటీ ఇచ్చాడు. ఈ వార్త భారత శిబిరాన్ని ఆందోళనకు గురి చేసింది. దీంతో మరోసారి టీమిండియా బుమ్రాపై ఆధారపడాల్సిందేనని అర్ధమవుతుంది. అటు టీమిండియాకు మరోసారి హెడేక్ తప్పేలా లేదని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26 నుంచి మెల్‌బోర్న్‌లో నాలుగో మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం రెండు జట్లు 1-1తో సమంగా ఉన్నందున రెండు జట్లూ తమ అత్యుత్తమ ఎలెవన్‌తో ఆ మ్యాచ్‌ను గెలవాలని కోరుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తదుపరి మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌లో ముందంజలో ఉంటుంది. అదే సమయంలో భారత జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకోవాలంటే ఎలాగైనా మిగిలిన 2 టెస్ట్ మ్యాచ్‌లను గెలవాలి.