పెద్దన్న గెలిచాడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ భారీ విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన ట్రంప్... డెమొక్రాట్ అభ్యర్ధి కమలా హ్యారిస్ పై విజయం సాధించారు. 277 ఎలక్టోరల్ ఓట్లతో మేజిక్‌ ఫిగర్‌ క్రాస్‌ చేసిన ట్రంప్‌, 67,204,711 పాపులర్‌ ఓట్లు సాధించారు.

  • Written By:
  • Updated On - November 6, 2024 / 12:30 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ భారీ విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన ట్రంప్… డెమొక్రాట్ అభ్యర్ధి కమలా హ్యారిస్ పై విజయం సాధించారు. 277 ఎలక్టోరల్ ఓట్లతో మేజిక్‌ ఫిగర్‌ క్రాస్‌ చేసిన ట్రంప్‌, 67,204,711 పాపులర్‌ ఓట్లు సాధించారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గతంలో అమెరికా అధ్యక్షుడిగా పని చేసిన ట్రంప్‌… రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కనున్నారు.

మేజిక్‌ ఫిగర్‌కు 44 ఎలక్టోరల్‌ ఓట్ల దూరంలో హ్యారిస్‌ ఆగిపోయారు. చివర్లో గట్టి పోటీ ఇచ్చినా స్వింగ్ స్టేట్స్ లో ట్రంప్ ఆధిపత్యం కొనసాగడంతో కమలా ఓటమి పాలయ్యారు. మొదటి నుంచి చివరి వరకూ ట్రంప్ దూకుడు కొనసాగింది. ఒకానొక దశలో స్లో అయిన ట్రంప్ 230 ఓట్ల దగ్గర ఆగిపోయారు. ఆ సమయంలో కమలా హ్యారిస్ వేగంగా అందుకుని గట్టి పోటీ ఇచ్చారు. 226 ఓట్ల దగ్గర కమలా ఆగిపోయారు. కమళా హ్యారిస్‌కు 62,303,005 పాపులర్ ఓట్లు రాగా చివర్లో ట్రంప్ మెరుపు వేగంతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.