మీ జాతకంలో ఏలినాటి శని నడుస్తుందా.. కొబ్బరి దీపం పెట్టిచూడండి.. ఇక తిరుగుండదు

దీపం.. పరబ్రహ్మ స్వరూరం. శ్రీమహాలక్ష్మీదేవి ప్రతిరూరం. దీపం... మనలోని చీకటిని తొలగించి.. వెలుగులు నింపుతుంది. దీపం వెలిగించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే చాటు... లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని అంటారు. వెలుగులు చిమ్మే దీపాలను చూస్తే.. మనసు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది.

  • Written By:
  • Publish Date - November 30, 2024 / 02:28 PM IST

దీపం.. పరబ్రహ్మ స్వరూరం. శ్రీమహాలక్ష్మీదేవి ప్రతిరూరం. దీపం… మనలోని చీకటిని తొలగించి.. వెలుగులు నింపుతుంది. దీపం వెలిగించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే చాటు… లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని అంటారు. వెలుగులు చిమ్మే దీపాలను చూస్తే.. మనసు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. దీపం ఉన్న ఇంట్లో.. ఆధ్యాత్మిక భావన నిండి ఉంటుంది. కార్తీక మాసంలో మనం చేసే పూజ.. దీపారాధనతో మొదలైతే.. అఖండ ఫలితం లభిస్తుందని ప్రతీతి. అయితే.. ఈ దీపాల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. ఒక్కో దీపానికి… ఒక్కో విశిష్టత కూడా ఉంది.

దీపాల్లో ఉండే రకాలు…

దీపం అంటే… దేవుడి ముందు వెగిలించే దివ్వజ్యోతి. కార్తీకమాసంలో అయితే… దీపారాధనే ముఖ్యం. ఈ మాసంలో రకరకాల దీపాలు వెలిగిస్తుంటారు భక్తులు. చిత్రదీపం, మాలా దీపం, ఆకాశ దీపం, జల దీపం, మోక్ష దీపం, అఖండ దీపం, లక్ష దీపం, పిండి దీపం, ఉసిరి దీపం, కొబ్బరి దీపం.. ఎలా ఎన్నో రకాల దీపాలు. వీటిలో ఉసిరి దీపం.. కొబ్బరి దీపంకు ఉన్న విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉసిరి దీపం విశిష్టత..

కార్తీక మాసం వెలిగించే దీపాల్లో విశిష్టమైనది.. ఉసిరి దీపం. ఉసిరిచెట్టు సాక్షాత్తు ఈశ్వర స్వరూపం. ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం. కార్తిక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తే.. లక్ష్మీదేవితో పాటు శ్రీమహావిష్ణువు, శివుడి అనుగ్రహం కూడా లభిస్తుందని భక్తుల విశ్వాసం. కార్తీక సోమవారాలు, పౌర్ణమి తిథుల్లోనే కాదు… కార్తీక ఏకాదశి రోజు కూడా ఉసిరి దీపం పెడితే.. శుభఫలితాలు అందుకుంటారు.

ఉసిరి దీపం వెలిగించే విధానం…

ఉసిరికాయను తీసుకుని కడిగి ఆరబెట్టాలి. ఆ తర్వత… ఉసిరికాయ తొడిమ దగ్గర… నెయ్యి పోసేందుకు వీలుగా… కట్‌ చేసుకోవాలి. అందులో స్వచ్ఛమైన ఆవు నెయ్యి పోసుకోవాలి. ఆ నేతిలో తామ కాడల వత్తులు వేసి దీపం వెలిగించాలి. నిష్టగా హరిహరుల నామస్మరణ చేస్తూ…. ఉసిరి దీపం వెలిగిస్తే.. మహిళలు దీర్ఘసుమంగళీ ప్రాప్తాన్ని చేజిక్కించుకోవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అంతేకాదు.. నవగ్రహాలతో పాటు సమస్త దోషాలు తొలిగిపోతాయట. ఆర్థిక ఇబ్బంది దరిచేరవట. అష్ట దారిద్ర్యాలు తొలగిపోయి.. లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. తులసికోట దగ్గర ఉసిరి దీపం వెలిటిస్తే.. ఆ తల్లి కోరిన కోర్కెలు తీరుస్తుందట.

కొబ్బరి దీపం విశిష్టత..

కొబ్బరి దీపం… దీన్నే నారీకేళి దీపం అని కూడా పిలుస్తారు. కార్తీక మాసంలో కొబ్బరి దీపం వెలిగిస్తే… గొప్ప ఫలితాలను ఇస్తుందని చెప్తుంటారు. ముఖ్యంగా… ఏలినాటి శని ప్రభావం ఉన్న జాతకులు కొబ్బరి దీపం వెలిగిస్తే.. మంచి జరుగుతుందట. దుస్థానంలో ఉన్న శని.. అనుకూలించేందుకు… ఏలినాటి శని, పంచమ శని, అష్టమ శనితో బాధపడుతున్న వాళ్లు.. కొబ్బరి దీపం పెడితే.. శుభఫలితాలు అందుకుంటారట. శివుడు ముక్కంటి… మూడు కన్నులు ఉన్న వాడు. అందుకే మూడు కళ్లు ఉన్న కొబ్బరినాయను నివేదిస్తే కోరుకున్న కోరికలను… త్రినేత్రుడు తీరుస్తాడని పురాణాలు చెప్తున్నాయి.

కొబ్బరి దీపం ఎందుకు పెడతారు..

కొబ్బరి దీపాన్ని.. దేవతలకు వెలిగించరు. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కాలనుకునే వారు మాత్రమే.. కొబ్బరి దీపం వెలిగించాలి. చట్టపరమైన ఇబ్బందుల్లో ఉన్నవారు.. అంటే.. కోర్టు కేసులు, పోలీసు కేసుల్లో చిక్కుకున్నవారు.. ఆ బాధల నుంచి విముక్తిపొందాలంటే… కొబ్బరి దీపం వెలిగించవచ్చు. అలాగే… ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు, దరిద్రం నుంచి బయటపడేందుకు కూడా కొబ్బరి దీపం… మార్గం చూపుతుందన్నది పండితుల మాట. అలాగే ఏలిశని దోషాలు.. ఇతి బాధలు.. కొబ్బరి దీపంతో తొలగిపోతాయని నానుడి.

కొబ్బరి దీపం పెట్టే విధానం…

ముందుగా అర్థనారీశ్వరుడి పటాన్ని శుభ్రం చేసుకోవాలి. పటానికి పసుపు, కుంకుమతో బొట్లు పెట్టాలి. పటానికి పుష్పాలంకరణ చేయాలి. పటం ముందు… అష్టదళ ముగ్గు వేయాలి. ఆ ముగ్గుపై దీపారాధన కోసం ఇత్తడి పాత్ర తీసుకోవాలి. ఆ పాత్రకు పసుపు, కుంకుమతో బొట్లు పెట్టాలి. ఆ తర్వాత పాత్రలో ఒక వస్త్రాన్ని ఉంచాలి. వస్త్రంపై బియ్యం వేయాలి. కొబ్బరికాయను తీసుకుని రెండు చిప్పులుగా పగలగొట్టాలి. ఒక కొబ్బరి చిప్పను తీసుకుని… బియ్యంపై ఉంచాలి. ఆ కొబ్బరి చిప్పకు కూడా… పసుపు, కుంకుమతో బొట్లు పెట్టాలి. ఆ తర్వాత కొబ్బరి చిప్పలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి పోయాలి. అందులో ఎనిమిది వత్తులు వేయాలి. ఎనిమిది వత్తులు ఎందుకు వేయాలంటే… శనీశ్వరుడికి ఎనిమిది సంఖ్య అంటే ఎంతో ప్రీతికరం. ఏలినాటి శనితో బాధపడుతున్నారు… ఎనిమిది వత్తులతో కొబ్బరి దీపం విలిగిస్తే మంచింది. రెండు వత్తులను ఒక వత్తిగా మార్చి… ఎనిమిది వత్తులను… నాలుగు వత్తులు చేసుకుని… కొబ్బరి దీపంలో ఉంచాలి. కొబ్బరి దీపానికి పుష్పం కూడా సమర్పించుకోవాలి. ఆ తర్వాత… కొబ్బరి దీపం వెలిగించుకోవాలి. మహాశివుడికి పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. ఏలినాటి శని బాధాలు తొలగించు దేవుడా అని మహాశివుడిని ప్రార్థించాలి. అలా చేస్తే… ఏలినాటి శని బాధలు తొలగిపోతాయని నమ్మకం. ఏలినాటి శని ప్రభావమే కాదు… చట్టపరమైన సమస్యలు… వివాహ సంబంధ సమస్యలు, ఆర్ధిక సమస్యలను.. కొబ్బరి దీపం హరించివేస్తుందట.