TS DSC 2024: డీఎస్సీ దరఖాస్తుల గడువు పొడిగింపు.. పరీక్ష తేదీలివే..

కొత్త షెడ్యూల్ ప్రకారం.. జూన్ 20 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నిజానికి ఈ గడువు మంగళవారం, ఏప్రిల్ 2తో ముగియాలి. కానీ, అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు జూన్ 20, రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

  • Written By:
  • Updated On - April 3, 2024 / 01:32 PM IST

TS DSC 2024: తెలంగాణలో డీఎస్సీ అభ్యర్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. డీఎస్సీ దరఖాస్తు గడువు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాదు.. పరీక్ష తేదీలను కూడా వెల్లడించింది. దీనిపై తాజాగా కొత్త షెడ్యూ‌ల్‌తో ఆదేశాలు జారీ చేసింది. కొత్త షెడ్యూల్ ప్రకారం.. జూన్ 20 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నిజానికి ఈ గడువు మంగళవారం, ఏప్రిల్ 2తో ముగియాలి. కానీ, అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు జూన్ 20, రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

YS JAGAN: చంద్రబాబుకు ఓటేస్తే వాలంటీర్లను రద్దు చేసినట్లే: జగన్

అర్హులైన అభ్యర్థులు రూ.1000 ఫీజు చెల్లించి, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. డీఎస్సీ పరీక్ష తేదీలను కూడా విద్యాశాఖ వెల్లడించింది. జూలై 17 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌‌లో పరీక్షలు నిర్వహిస్తారు. అయితే, గతంలో దరఖాస్తు చేసుకున్నవాళ్లు మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ, దరఖాస్తులో మార్పులు చేసుకునే అవకాశం కల్పించింది. తెలంగాణలో 11,062 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. వీటిలో 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు, 6,508 ఎస్జీటీలు, 182 పీఈటీలు, 727 భాషా పండితులు; స్పెషల్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్‌ అసిస్టెంట్‌, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. తెలంగాణలో అత్యధిక ఖాళీలు హైదరాబాద్‌లో ఉన్నాయి.

హైదరాబాద్‌లో 878 పోస్టులు ఖాళీగా ఉండగా, ఆ తర్వాత వరుసగా నల్గొండలో 605, నిజామాబాద్‌లో 601, ఖమ్మంలో 757, సంగారెడ్డిలో 551, కామారెడ్డిలో 506 చొప్పున ఖాళీలున్నాయి. డీఎస్సీకి ముందు నిర్వహించాల్సిన తెలంగాణ టెట్ నోటిఫికేషన్ గతంలోనే విడుదలైందది. మార్చి 27 నుంచి దరఖాస్తులు ప్రారంభం కాగా ఏప్రిల్ 10తో దరఖాస్తులు ముగుస్తాయి. మే 20 నుంచి జూన్ 6వ తేదీ వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి.