TS EAPCET: తెలంగాణలో ఈఏపీసెట్ షెడ్యూల్ విడుదల

డీన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 21న ఎంసెట్‌ నోటిఫికేషన్‌ విడుదలవుతుంది. ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. మే 9 నుంచి 12 వరకూ పరీక్షలు జరుగుతాయి. ఎంసెట్ పేరును తెలంగాణ ప్రభుత్వం ఇటీవల టీఎస్ఈఏపీసెట్ గా మార్చిన సంగతి తెలిసిందే.

  • Written By:
  • Publish Date - February 6, 2024 / 04:42 PM IST

TS EAPCET: తెలంగాణలో ఈఏపీసెట్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 21న దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సెట్ కన్వీనర్, ప్రొఫెసర్ డీన్ కుమార్ మంగళవారం వెల్లడించారు. సెట్ కమిటీ ఆధ్వర్యంలో షెడ్యూల్ ఆమోదించినట్లు ఆయన తెలిపారు. డీన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 21న ఎంసెట్‌ నోటిఫికేషన్‌ విడుదలవుతుంది. ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు.

Madhya Pradesh: బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 11 మంది మృతి.. 60 మందికి గాయాలు..

మే 9 నుంచి 12 వరకూ పరీక్షలు జరుగుతాయి. ఎంసెట్ పేరును తెలంగాణ ప్రభుత్వం ఇటీవల టీఎస్ఈఏపీసెట్ (TS EAPCET)గా మార్చిన సంగతి తెలిసిందే. టీఎస్ఈఏపీసెట్ ద్వారా రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కాలేజీల్లో అడ్మిషన్లకు పరీక్ష నిర్వహిస్తారు. టీఎస్ఈఏపీసెట్ అంటే తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీసెట్‌ అని అర్థం. జేఎన్‌టీయూ, హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరుగుతుంది.

అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక.. మెడిసిన్ కోర్సు కోసం దేశవ్యాప్తంగా నీట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.