TS RTC Buses: తెలంగాణ ఆర్టీసీకి 80 కొత్త బస్సులు వస్తున్నాయి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వీటిని శనివారం నాడు ప్రారంభించబోతున్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మార్గ్ లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రూ.400 కోట్ల ఖర్చుతో 1050 కొత్త డీజిల్ బస్సులను కూడా కొంటామని అధికారులు చెబుతున్నారు. వీటిల్లో 400 ఎక్స్ ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులు ఉంటాయి. పర్యావరణ హితంగా ఎలక్ట్రిక్ వాహనాలను కూడా హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 బస్సులను వినియోగంలోకి తెస్తారు. శనివారం నుంచి కొత్తగా వస్తున్న 80 బస్సుల్లో 30 ఎక్స్ ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లాహరి స్లీపర్ కమ్ సీటర్ (నాన్ ఏసీ) బస్సులు ఉన్నాయి.