TS SET 2024 Notification : TS SET 2024 నోటిఫికేషన్ విడుదల..

తెలంగాణ రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌, డిగ్రీ కాలేజీల లెక్చరర్‌ ఉద్యోగాల అర్హత పరీక్ష అయిన టీఎస్‌ సెట్-2024 కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రంలోని టీఎస్ సెట్ కార్యాలయంలో ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌, డిగ్రీ కాలేజీల లెక్చరర్‌ ఉద్యోగాల అర్హత పరీక్ష అయిన టీఎస్‌ సెట్-2024 కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రంలోని టీఎస్ సెట్ కార్యాలయంలో ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్‌ విడుదల కార్యక్రమంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్‌ ఆర్ లింబాద్రి, ఓయూ వీసీ ప్రొఫెసర్‌ రవిందర్‌ యాదవ్, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ వీసీ ప్రొఫెసర్ గోపాల్‌ రెడ్డి, శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ ఎస్ మల్లేశ్, ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్‌ పీ లక్ష్మీనారాయణ, ఓఎస్డీ ప్రొఫెసర్‌ రెడ్యానాయక్, సెట్ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ జీ నరేష్ రెడ్డి పాల్గొన్నారు. శనివారం TS SET 2024 నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ మేరకు ముఖ్య తేదీలను ప్రకటించారు.

  • పరీక్ష తేదీలు..

ఈ సందర్భంగా ప్రొఫెసర్ నరేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఆగస్టు 28, 29, 30, 31వ తేదీల్లో 29 సబ్జెక్టుల్లో సెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత డిసైడ్ చేయడానికి ప్రతి ఏడాది సెట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా తెలంగాణ సెట్ – 2024 (Telangana State Eligibility Test Exam) పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ- OU నిర్వహించనుంది. మే 14 నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తులను ఆన్ లైన్ లోనే సమర్పించాలి. జూలై 2వ తేదీతో దరఖాస్తు గడువు ముగుస్తుంది. ఫైన్ తో జూలై 26వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఆగస్టు 20వ తేదీ నుంచి సెట్ హాల్ టికెట్లు విడుదల చేయనున్నారు. ఇక ఆగస్టు 28 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఆగస్టు 31వ తేదీతో ఎగ్జామ్స్ ముగిసిపోనున్నాయి.

  • పరీక్ష రుసుము..

ఈనెల 14 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్టు వెల్లడించారు. తెలంగాణ ఉమ్మడి 10 జిల్లా కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు సెంటర్‌లను ఎత్తేశారు. గతంలో మాదిరిగానే పరీక్ష ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ట్రాన్స్‌జెండర్‌లకు రూ.1000, బీసీలకు రూ.1500, ఓసీలకు రూ.2000గా నిర్ణయించారు.

  • దరఖాస్తు ఇదే చివరి తేదీ..

ఆసక్తిగల అభ్యర్థులు జూలై 2వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అపరాధ రుసుముతో జులై 26వ తేదీ వరకు సమయం ఉంటుంది. ఆగస్టు 20 తేదీ నుంచి వెబ్‌సైట్‌ ద్వారా హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 2023లో నిర్వహించిన టీఎస్ సెట్‌కు 33,866 మంది దరఖాస్తులు చేసుకోగా.. 2,278 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.

  • అధికారిక వెబ్ సైట్..

తెలంగాణ సెట్ అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలకు http://telanganaset.org/ వెబ్ సైట్ విజిట్ చేస్తే సరిపోతుంది. సెట్ పరీక్షను 2 పేపర్లుగా నిర్వహిస్తారు. పేప‌ర్-1లో 50 ప్రశ్నల‌కు 100 మార్కులు ఉంటాయి. పేప‌ర్-2లో 100 ప్రశ్నల‌కు 200 మార్కులు ఉంటాయి.

SSM