TS 10th Results: తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల.. 91 శాతం ఉత్తీర్ణత

ఫలితాల్లో బాలికలు పైచేయిగా నిలిచింది. 93.23 శాతం బాలికలు, 89.42 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు. జిల్లాల వారీగా.. 99.05 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్‌ జిల్లా మొదటి స్థానంలో ఉండగా, 65.10 శాతంతో వికారాబాద్‌ చివరి స్థానంలో ఉంది.

  • Written By:
  • Updated On - April 30, 2024 / 12:39 PM IST

TS 10th Results: తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం ఉదయం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 5,05,813 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో బాలురు 2,57,952 మంది; బాలికలు 2,50,433 మంది ఉన్నారు. వీరిలో 91.31 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

SINGER MANGLI: ఫోక్ రాణికి మరో అరుదైన గౌరవం.. మీ ప్రేమకు ధన్యవాదాలంటూ మంగ్లీ పోస్ట్

ఫలితాల్లో బాలికలు పైచేయిగా నిలిచింది. 93.23 శాతం బాలికలు, 89.42 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు. జిల్లాల వారీగా.. 99.05 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్‌ జిల్లా మొదటి స్థానంలో ఉండగా, 65.10 శాతంతో వికారాబాద్‌ చివరి స్థానంలో ఉంది. తెలంగాణలోని 3,927 స్కూల్స్‌ వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 98.71శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు, 2,676 ప‌రీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. రాష్ట్రంలో 11 జిల్లాల్లోని, 19 కేంద్రాల్లో టెన్త్ ఆన్సర్‌షీట్స్ వ్యాల్యుయేషన్ జరిగింది. ఈ ప్రక్రియ ఏప్రిల్ 20న ముగిసింది. అనంతరం మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేసి నేడు ఫలితాలు విడుదల చేశారు. 27 రోజుల్లోనే రిజల్ట్స్ విడుదల చేయడం విశేషం.

పదోతరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు https://bse.telangana.gov.in/ సైట్‌ని సందర్శించాలి. ఫెయిలైన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షల్ని కూడా త్వరలోనే నిర్వహించబోతున్నారు. ఫెయిలైన విద్యార్ధులు తాము చదువుకున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మే 16వ తేదీలోగా ఫీజులు చెల్లించాలి. రూ.50రుపాయల పెనాల్టీతో విద్యార్ధులు సంబందిత సబ్జెక్టు పరీక్ష జరిగే రెండు రోజుల ముందు కూడా పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.