Inter Hall Ticket: తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల హాల్ టిక్కెట్లు సోమవారం విడుదలయ్యాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. ఆన్లైన్లో విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. tsbie.cgg.gov.in లోకి వెళ్లి మీ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలు మార్చి 19 వరకు జరుగుతాయి. పరీక్షా సమయం ప్రతిరోజు ఉదయం 9 నుంచి.. మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది.
Arvind Dharmapuri: నియంత అర్వింద్ వెళ్లిపో.. నువ్ మాకొద్దు.. బీజేపీ నేతల తిరుగుబాటు..
ఫస్టియర్, సెకండియర్ కలిపి ఈ ఏడాది 9.8 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని విద్యాశాఖ తెలిపింది. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు ఈఎస్ఎస్ఎస్ సి లేదా ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ తో థియరీ పరీక్ష హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోగలరు. ఇంటర్ ద్వితియ సంవత్సరం విద్యార్థులు, మొదటి సంవత్సరం హాల్ టికెట్ లేదా సెకండియర్ హాల్ టికెట్ నెంబర్‌తో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టిక్కెట్లలో ఏవైనా తప్పులు జరిగినా సరిదిద్దుకునే అవకాశం ఉంది.
అంటే పేర్లలో తప్పు, ఫొటో, ఇతర వివరాలు వంటివి తప్పుగా వస్తే కాలేజీ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్ళి సరిదిద్దుకునే అవకాశం ఉంది. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ పరీక్షలు ఈ నెల 1 నుంచి 15వ తేదీ వరకు జరిగాయి. రెండో శనివారం, ఆదివారాల్లో కూడా ఈ పరీక్షలను నిర్వహించారు. రెండు సెషన్లలో అంటే ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్లో ప్రాక్టికల్ పరీక్షలు జరిగాయి.
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఇది..
ఇంటర్ ఫస్ట్ ఇయర్..
ఫిబ్రవరి 28: పార్ట్ 2 (సెకండ్ లాంగ్వేజ్ పేపర్ వన్)
మార్చ్ 1: పార్ట్ 1 (ఇంగ్లీష్ పేపర్ వన్)
మార్చి 4: పార్ట్ 3 (మ్యాథ్స్ పేపర్ 1A, బోటనీ పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1)
మార్చి 6: మాథెమాటిక్స్ పేపర్ -1బి, జువాలజీ పేపర్ -1, హిస్టరీ పేపర్ -1
మార్చి 11: ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్ -1
మార్చి 13: కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్ -1
మార్చి 15: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1, బ్రిడ్జి కోర్స్ మాథ్స్ పేపర్ -1 ( బిఐపిసి విద్యార్థులకి)
మార్చి 18: మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్ -1
ఇంటర్ సెకండ్ ఇయర్..
ఫిబ్రవరి 29: పార్ట్ 2 (సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2)
మార్చి 2: పార్ట్ 1 (ఇంగ్లీష్ పేపర్-2)
మార్చి 5: పార్ట్ 3 (మ్యాథ్స్ పేపర్2A, బోటనీ పేపర్2, పొలిటికల్ సైన్స్ పేపర్ 2)
మార్చి 7: మ్యాథ్స్ పేపర్ 2బి, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2
మార్చ్ 12: ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2
మార్చి 14: కెమిస్ట్రీ పేపర్ -2, కామర్స్ పేపర్ -2
మార్చి 16: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -2, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్ -2 ( బిఐపిసి విద్యార్థులకు)
మార్చి 19: మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్ -2