TSPSC GROUP 1: తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దైంది. ఈ మేరకు టీఎస్‌పీఎస్‌సీ తాజాగా నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం, ఏప్రిల్ 26, 2022న విడుదల చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు చేస్తూ టీఎస్‌పీఎస్‌సీ కొత్త నోటిఫికేషన్‌లో పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు రెండేళ్లక్రితం 503 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. కానీ, రెండేళ్లక్రితం తొలిసారి నిర్వహించిన గ్రూప్-1 పేపర్ లీకైన సంగతి తెలిసిందే.
ALI YSRCP: అలీకి వైసీపీ టిక్కెట్.. పోటీ చేసేది ఎక్కడ..?
ఈ నేపథ్యంలో పేపర్ లీకేజీతోపాటు ఇతర అంశాల్ని పరిగణనలోకి తీసుకుని, పాత నోటిషికేషన్ రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ సెక్రెటరీ డా.నవీన్ నికోలస్ పేర్కొన్నారు. ఈ అంశంపై అభ్యర్థులకు వ్యక్తిగతంగా సమాచారం అందించనున్నట్లు తెలిపారు. అయితే, నిరుద్యోగుల కోసం త్వరలోనే 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ వెల్లడించనుంది ప్రభుత్వం. ఇప్పటికే విడుదల చేసిన 503 గ్రూప్-1 పోస్టులకు అదనంగా, మరో 60 పోస్టుల్ని పెంచుతూ తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో మరో 60 గ్రూప్ 1 పోస్టులతో కలిపి 563 పోస్టులతో నోటిఫికేషన్ రానుంది. రెండేళ్ల నోటిఫికేషన్‌కు సంబంధించి తొలిసారి నిర్వహించిన గ్రూప్ 1 పేపర్ లీక్ కావడంతో ఆ పరీక్ష రద్దైంది.
తర్వాత రెండోసారి నిర్వహించిన పరీక్షలో కొందరి బయోమెట్రిక్ హాజరు తీసుకోలేదని కేసు నమోదైంది. ఈ అంశాలపై కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. అందువల్ల అన్ని అంశాలపై చర్చించిన తర్వాత పాత నోటిఫికేషన్ రద్దు చేసింది. కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త నోటిఫికేషన్ విడుదల తేదీపై త్వరలోనే ప్రకటన రానుంది.